గెలుస్తానా ? లేదా ? టెన్షన్‌లో బాలకృష్ణ... హిందూపురం నేతలతో భేటీ

ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ మధ్య ఎన్నికల వార్ హోరాహోరీగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో... హిందూపురంలో పరిస్థితి ఎలా ఉందనే దానిపై పార్టీ నేతలతో బాలకృష్ణ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: April 27, 2019, 11:27 AM IST
గెలుస్తానా ? లేదా ? టెన్షన్‌లో బాలకృష్ణ... హిందూపురం నేతలతో భేటీ
నందమూరి బాలకృష్ణ(File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం అభ్యర్థుల్లో అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఫలితాలు వెలువడటానికి మరికొద్ది వారాల సమయం ఉండటంతో... పోలింగ్ సరళిని బట్టి ఫలితాలను అంచనా వేసుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ ఎలా జరిగింది ? ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు పడ్డాయి ? అందులో మనకు వచ్చే ఓట్లు ఎన్ని ? అనే అంశంపై ప్రధాన పార్టీల నేతలు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య... తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.

అయితే ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ మధ్య ఎన్నికల వార్ హోరాహోరీగా ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో... హిందూపురంలో పరిస్థితి ఎలా ఉందనే దానిపై పార్టీ నేతలతో బాలకృష్ణ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో బాలకృష్ణ రెండు రోజులపాటు నియోజకవర్గంలో మకాం వేశారు. ఈ సందర్భంగా మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఆయన నివాసంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతర్గతంగా నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలతో ఈ నెల 11న జరిగిన పోలింగ్ సరళిపై ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గంలోని 2,29,262 ఓటర్లకుగాను 1,77,903 ఓట్లు పోలింగు కాగా 77.60 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

First published: April 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు