ఇటీవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.దీంతో ఈ పోలీస్ స్టేషన్‌ను టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆశ్రయించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెట్లు పెడుతున్నారని ఆమె రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యకర కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మహిళా కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు.
ఇదే విషయమై ఆదిరెడ్డి భవాని అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆమె గళం వినిపించారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెడుతున్నారని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు ఎమ్మెల్యే భవానీ. 'దిశ చట్టం నా నుంచే మొదలు కావాలని అసెంబ్లీ సాక్షిగా' నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని భవానీ అన్నారు. దీనిపై వైసీపీ నాయకురాలు హోంమంత్రి సుచరిత స్పందిస్తూ టీడీపీ ఎమ్మెల్యే భవానీపై సోషల్ మీడియాలో పెట్టిన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినిపై ఇద్దరు యువకులు అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో ఆ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను కించపరిచే విధంగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు సత్యంరెడ్డి, ప్రవీణ్ లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేశారు. ఈ విషయమై ఆరా తీసిన చిలకలూరిపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, AP disha act, Disha police station, Tdp