AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల్లో జగన్‌ను ఇరుకున పెట్టేందుకు టీడీపీ భారీ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30 నుంచి జరగనున్నాయి. నాలుగైదు రోజుల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయి.

news18-telugu
Updated: November 27, 2020, 6:39 PM IST
AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల్లో జగన్‌ను ఇరుకున పెట్టేందుకు టీడీపీ భారీ ప్లాన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నవంబర్ 30 నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో (Andhra Pradesh Assembly Winter sessions) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ  (Tellugu Desam Party) భారీ ప్లాన్ సిద్ధం చేస్తోంది. తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడు (K.Atchannaidu) అధ్యక్షతన టీడీపీ శాసనసభ, శాసనమండలి సభ్యులతో టెలికాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో 20 అంశాలను అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించారు. శాసనసభ సమావేశాలు ప్రజల్లోకి వెళ్ళడానికి మీడియాను అనుమతించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సమావేశాలలో తప్పనిసరిగా ప్రశ్నోత్తరాలకు, స్వల్పకాలిక చర్చకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను పూర్తి స్థాయిలో విశ్లేషించి ప్రజలకు నష్టం చేకూర్చే అంశాలుంటే సవరణలకు పట్టుబడతామని తెలిపారు.

Gold Rates: మంచిరోజులు వచ్చాయ్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

Raghavendra Rao: హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్రరావు, నలుగురు హీరోయిన్లు..

అసెంబ్లీలో టీడీపీ లేవనెత్తనున్న అంశాలు
1. ఎన్ఆర్ఈజీఎస్ బకాయిలు నిలిపివేత
2. టిడ్కో ఇళ్ల పంపిణీ – ఇళ్ల పట్టాలలో అవినీతి
3. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు

4. భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం – పంటల కొనుగోళ్లు
5. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు
6. నూతన ఇసుక పాలసీ – దోపిడీ
7. నిత్యావసర ధరల పెరుగుదల – ప్రజలపై భారాలు
8. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం
9. పెరుగుతున్న నిరుద్యోగం – మూతపడుతున్న పరిశ్రమలు
10. పీపీఏల రద్దు – జీవో నెం.25
11. ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు – ప్రభుత్వ నిర్లక్ష్యం
12. మద్యం అమ్మకాలు – నాశిరకం బ్రాండ్లు
13. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల దుస్థితి – రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్, జీవో 21 రద్దు
14. సంక్షేమ పధకాలు రద్దు - సబ్ ప్లాన్ల నిర్వీర్యం
15. పెన్షన్ రెండో విడత పెంపు వైఫల్యం
16. కరోనా – సహాయ చర్యల్లో వైఫల్యం
17. పన్నుల పెంపు – ఆస్థి పన్ను
18. స్థానిక సంస్థల ఎన్నికలు
19. దేవాలయాలపై దాడులు
20. మితిమీరిన అప్పులు – దుబారా

AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్, డిసెంబర్ నుంచి..

Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు

గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగైదురోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కరోనా వైరస్ కారణంగా గట్టి చర్యలు తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాల తరహాలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి అందరూ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు (నవంబర్ 27)న జరిగిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2020, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading