రెండు రోజులు.. ఆరు గంటలు.. టీడీపీ మహానాడుపై క్లారిటీ

ఎన్టీఆర్ జయంతి కలిసొచ్చేలా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని... ఈసారి ఆన్‌లైన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: May 21, 2020, 8:17 PM IST
రెండు రోజులు.. ఆరు గంటలు.. టీడీపీ మహానాడుపై క్లారిటీ
టీడీపీ మహానాడు కార్యక్రమం(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం... ఈ సారి కరోనా కారణంగా ఆన్ లైన్ ద్వారా నిర్వహించబోతున్నారు. ఎన్టీఆర్ జయంతి కలిసొచ్చేలా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని... ఈసారి ఆన్‌లైన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ మొత్తం కార్యక్రమాన్ని ఆరు గంటల్లో పూర్తి చేసేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మే, 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తొలి రోజు మూడు గంటలు, రెండో రోజు మూడు గంటలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. 27న ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర కార్యక్రమం ఉంటుంది. ఉదయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్యనేతల ప్రసంగాల అనంతరం తీర్మానాలు ప్రవేశపెడతారు, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 28న ఆయనకు నివాళులు అర్పించి, కార్యక్రమం కొనసాగిస్తారు. మహానాడులో సుమారు 14 వేల మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




First published: May 21, 2020, 8:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading