నేటి నుంచి టీడీపీ మహానాడు.. అమరావతి నుంచి చంద్రబాబు ప్రసంగం..

తెలుగుదేశం పార్టీ లోగో

టీడీపీ మహానాడు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం అంతా జూమ్ యాప్ ద్వారా సాగనుంది.

 • Share this:
  టీడీపీ మహానాడు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం అంతా జూమ్ యాప్ ద్వారా సాగనుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకావిష్కరణ చేసి, ఎన్టీఆర్‌కు నివాళి అర్పించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహానాడులో దాదాపు 25 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. మహానాడులో మొత్తం 52 మంది నేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణ నుంచి 1600 మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. తొలి రోజు అధికార పార్టీ వైసీపీ ఏడాది పాలనలో వైఫల్యాలు, రాజధానిగా అమరావతి కొనసాగించాల్సిన అంశాలతో పాటు, పోలవరం, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు, అక్రమ కేసుల బనాయింపులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి.
  టీడీపీ మహానాడు (Photo: Twitter)


  కాగా, రేపు (28వ తేదీన) టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇక్కడి నేతలు నివాళి అర్పించనున్నారు. మహానాడు కోసం అమరావతికి వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ రేపు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదు. దీంతో స్థానిక నేతలే ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తారు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published: