జూమ్ యాప్‌లో టీడీపీ మహానాడు.. ఈ కింది లింక్‌లో చూడొచ్చు..

TDP Mahanadu Live: టీడీపీ మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. సాంకేతికతను వాడుకోవడంలో ముందు వరుసలో ఉండే నారా చంద్రబాబునాయుడు జూమ్ యాప్ ద్వారా మహానాడును ప్రారంభించనున్నారు.

news18-telugu
Updated: May 27, 2020, 11:39 AM IST
జూమ్ యాప్‌లో టీడీపీ మహానాడు.. ఈ కింది లింక్‌లో చూడొచ్చు..
టీడీపీ డిజిటల్ మహానాడు
  • Share this:
టీడీపీ మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. సాంకేతికతను వాడుకోవడంలో ముందు వరుసలో ఉండే నారా చంద్రబాబునాయుడు ఈ సారి టెక్నాలజీని వాడుకొని మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయం నుంచే జూమ్ యాప్ ద్వారా మహానాడును నిర్వహించనున్నారు.  ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకావిష్కరణ చేసి, ఎన్టీఆర్‌కు నివాళి అర్పించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మహానాడులో దాదాపు 25 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. మహానాడులో మొత్తం 52 మంది నేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణ నుంచి 1600 మంది కార్యకర్తలు హాజరుకానున్నారు.

టీడీపీ మహానాడులో జాయిన్ అయ్యేందుకు TDP Mahanadu ‌ను క్లిక్ చేయండి.

తొలి రోజు అధికార పార్టీ వైసీపీ ఏడాది పాలనలో వైఫల్యాలు, రాజధానిగా అమరావతి కొనసాగించాల్సిన అంశాలతో పాటు, పోలవరం, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు, అక్రమ కేసుల బనాయింపులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి.టీడీపీ మహానాడు షెడ్యూల్ ఇదే..


టీడీపీ మహానాడు షెడ్యూల్ ఇదే..


టీడీపీ మహానాడు షెడ్యూల్ ఇదే..
First published: May 27, 2020, 9:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading