పేరు పేదలది, మేసేది వైసీపీ... డ్రైవర్లకు డబ్బుల వెనుక మతలబు ఇదేనన్న టీడీపీ

6 లక్షల మంది డ్రైవర్లు ఉంటే అందులో రెండొంతుల మందికి ఎగ్గొట్టి అందరినీ ఉద్దరించినట్లుగా గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: June 4, 2020, 10:05 PM IST
పేరు పేదలది, మేసేది వైసీపీ... డ్రైవర్లకు డబ్బుల వెనుక మతలబు ఇదేనన్న టీడీపీ
వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే అని టీడీపీ అధినేత విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని.. సంపూర్ణ పోషణ చేసేవాళ్లైతే అన్నా కేంటిన్లు మూత వేస్తారా అని ప్రశ్నించారు.
  • Share this:
సంక్షేమం పేరుతో ప్రజల పేరు చెప్పి వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఆన్ లైన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వైసీపీ ఏడాది పాలనలో విచ్చలవిడిగా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పేదల నుంచి వసూళ్లు చేశారు. భూసేకరణలో స్కామ్ లు, మెరక చేయడంలో స్కామ్ లు. ఆవ భూముల్లో రూ.400కోట్ల స్కామ్ చేశారు. రూ.7 లక్షల విలువైన భూమిని రూ.45 లక్షల నుంచి రూ.70లక్షలకు కొంటున్నారు. 3 రెట్లు ధర చెల్లించినా రూ.21లక్షలు చెల్లించాల్సిన భూమిని దానికి మూడు నాలుగు రెట్లు చెల్లించి వైసీపీ నాయకులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. పల్లపు భూములు సేకరించి, మెరక వేయాలంటూ మళ్లీ దోపిడీ చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. ‘పేరు పేదలది, మేసేది వైసీపీ’ పేదల సంక్షేమాన్ని కూడా వైసీపీ గద్దలే స్వాహా చేస్తున్నాయన్నారు. ఏడాదిలోనే ఇంత అవినీతికి పాల్పడ్డారంటే రాబోయే 4ఏళ్లలో ఏ స్థాయిలో దోపిడీ ఉంటుందో ఆలోచిస్తేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారని అన్నారు.

ఇసుక రీచ్ లలో తవ్వినదానికి, స్టాక్ యార్డు నిల్వలకు పొంతన లేదని సాక్షాత్తూ మంత్రి పెద్దిరెడ్డి అన్నారని, 12లక్షల టన్నుల ఇసుక దారిమళ్లిందని, దాదాపు 55% అక్రమాలు జరిగాయని వెల్లడైందని టీడీపీ నేతలు అన్నారు. ‘ఏడాది గడిచినా ఇప్పటికీ గ్రామాల్లో ఇసుక దొరకడం లేదు, గ్రామాల్లో అన్ని పనులు ఆగిపోయాయి. కార్మికుల ఉపాధి పోయింది. ఎక్కడి ఇసుక అక్కడ విక్రయించకుండా, వేరే జిల్లాలకు తరలించి లారీ రూ.50 వేలు, రూ.70వేలకు అమ్ముతున్నారు.’ అని ఆరోపించారు.

ఇక మద్యం ధరలు విచ్చలవిడిగా పెంచేశారని, నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. అందుకే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ధరలు భరించలేక స్పిరిట్ తాగే దుస్థితి కల్పించారని మండిపడ్డారు. స్పిరిట్ తాగి ఏడుగురు చనిపోవడం వైసీపీ నిర్వాకాలకు పరాకాష్టగా టీడీపీ అభివర్ణించింది. వైసీపీ నాయకుల అండదండలతో పొరుగు రాష్టాల నుంచి యధేచ్చగా అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని, నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోందన్నారు.

వైసీపీ చెప్పేదానికి, ఆచరణలో జరిగేదానికి చాలా తేడా ఉందని, సామాన్యులకు ప్రభుత్వ లబ్ది అందే పరిస్థితి లేదన్నారు. అనేక నిబంధనలు, ఆంక్షలతో సంక్షేమానికి కోతలు పెట్టారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలకే ఇన్ని నిబంధనలు పెట్టి తమకు రావాల్సిన లబ్ది కూడా అడ్డుకుంటున్నారని ఆటో డ్రెవర్లు, దర్జీలలో ఆవేదన ఉందన్నారు. 6 లక్షల మంది డ్రైవర్లు ఉంటే అందులో రెండొంతుల మందికి ఎగ్గొట్టి అందరినీ ఉద్దరించినట్లుగా గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆటో డ్రెవర్లకు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ జరిమానాల కింద రెండింతలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 4, 2020, 9:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading