ప్రకాశం జిల్లాలో క్రాస్ ఓటింగ్... కుదేలైన టీడీపీ నేతలు

Prakasam Distrct : ఇదివరకు ఎప్పుడూ లేనట్లుగా ప్రజలు క్రాస్ ఓటింగ్‌ వెయ్యడంతో... ప్రకాశం జిల్లా... ఒంగోలు పార్లమెంటు స్థానంలోని 7 సీట్లలో 6 వైసీపీ గెలుచుకోవడమే గాక... ఎంపీ స్థానాన్ని 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో కైవసం చేసుకుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 27, 2019, 12:37 PM IST
ప్రకాశం జిల్లాలో క్రాస్ ఓటింగ్... కుదేలైన టీడీపీ నేతలు
చంద్రబాబు, వైఎస్ జగన్(File Photo)
  • Share this:
ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ 5, వైసీపీ 6 స్థానాలు గెలుచుకున్నాయి. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు టీడీపీలో చేరారు. అందువల్ల 2019 ఎన్నికల్లో 8 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని టీడీపీ ఆశలు పెట్టుకుంది. కానీ జగన్ ఫ్యాన్ హోరులో 4 స్థానాలకే పరిమితమైంది. గట్టి పోటీ ఇస్తారనుకున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి సైతం 2 లక్షలకు పైగా ఓట్లతో ఓడిపోవడంతో పార్టీ షాకైంది. దీనికి కారణం క్రాస్ ఓటింగ్. కొండపిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ టీడీపీకి 975 ఓట్ల ఆధిక్యం వస్తే... ఎంపీ స్థానంలో వైసీపీకి 1,877 ఓట్లు అధికంగా వచ్చాయి. పర్చూరులోనూ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సాంబశివరావుకు 1503 ఆధిక్యం వస్తే... ఎంపీ స్థానానికి వచ్చేసరికి వైసీపీకి 609 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇదీ జిల్లాలో క్రాస్ ఓటింగ్ తీరు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ స్థానాల్లో ప్రజలు ఎమ్మెల్యేకి టీడీపీకి ఓటు వేసి... ఎంపీకి మాత్రం వైసీపీకి ఓటు వేశారు.

2014 ఎన్నికల్లో ఓట్ల తేడా ఎక్కడా 2 వేల నుంచి 3 వేల ఓట్లకు మించలేదు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందీ లేదు. 2019 ఎన్నికల్లో మాత్రం దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ స్పష్టంగా తేడా నమోదైంది. ఓటర్లు విభిన్నంగా ఓట్లు వేశారు. దర్శి, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో ఓటర్లు ఏకపక్షంగా క్రాస్ ఓటింగ్‌తో వైసీపీకి మద్దతు పలికారు.


దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి 38,653 ఓట్ల ఆధిక్యం వస్తే... ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి 29,411 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో 9,242 ఓట్లు క్రాస్ పడ్డాయి.

కనిగిరిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థికి 40,671 ఓట్ల ఆధిక్యం వస్తే... వైసీపీ పార్లమెంట్ అభ్యర్థికి 33,614 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఇక్కడ 7,057 మంది క్రాస్ ఓట్లు వేశారు. మార్కాపురంలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థికి 18,453 ఓట్ల ఆధిక్యం వస్తే... ఇక్కడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థికి 14,564 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే 3,889 ఓట్లు క్రాస్ వేశారు.

బాపట్ల పార్లమెంట్ పరిధిలోనూ క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది. నాలుగు నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపింది. అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి 12,717 ఓట్ల ఆధిక్యం వస్తే.. ఇక్కడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి 5920 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అంటే.. 6,797 ఓట్లు వైసీపీకి క్రాస్ ఓటింగ్ ద్వారా పోలయ్యాయి.

చీరాలలోనూ టీడీపీ శాసనసభ అభ్యర్థికి 17,912 ఓట్ల ఆధిక్యం వస్తే... పార్లమెంట్ అభ్యర్థికి మాత్రం 11,692 ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చింది. సంతనూతలపాడులో వైసీపీ శాసనసభ అభ్యర్థికి 8,992 ఓట్ల ఆధిక్యం రాగా.. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థికి మాత్రం 13,466 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇక్కడ 4,474 మంది ఎంపీగా వైసీపీ, ఎమ్మెల్యేగా టీడీపీ గెలవాలని కోరుకున్నారు.


ఇదివరకు ఎప్పుడూ లేనట్లుగా ప్రజలు క్రాస్ ఓటింగ్‌ వెయ్యడంతో... ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంట్‌లో‌ని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 6 స్థానాలు గెలుచుకోవడమే గాక... ఎంపీ స్థానాన్ని 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో కైవసం చేసుకుంది. అసెంబ్లీ స్థానాల్లో 3,000 నుంచి 9,000 వరకూ ప్రజలు క్రాస్ ఓటింగ్ వేశారు. ఈ ఎఫెక్టుతో ప్రకాశం జిల్లాలో టీడీపీ కుదేలైంది. ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోనూ క్రాస్ ఓటింగ్ ప్రభావంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి ఓడిపోయారు.(డి.లక్ష్మీనారాయణ, కరెస్పాండెంట్, న్యూస్18)

 

ఇవి కూడా చదవండి :

కృష్ణా జిల్లా నుంచీ ఇద్దరికి మంత్రి పదవులు... క్యూలో ఆశావహులు...

టీడీపీలో 'కుల'కలం.. వైసీపీకి జైకొట్టిన బీసీలు... దెబ్బకొట్టిన జనసేన...

టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?
First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading