మరికాసేపట్లో పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతల సమావేశం

విశాఖలో ఈనెల 3న జరిగిన లాంగ్ మార్చ్‌కు పలువురు టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

news18-telugu
Updated: November 13, 2019, 10:19 AM IST
మరికాసేపట్లో పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతల సమావేశం
పవన్ కళ్యాణ్, చంద్రబాబు
  • Share this:
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మరికాసేపట్లో టీడీపీ నేతలు వెళ్లి కలవనున్నారు.  రేపు విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన మద్దతు కోరేందుకు టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌తో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై అటు జనసేన, ఇటు టీడీపీ వరుస ఆందోళనలు నిర్వహిస్తోంది. గుంటూరులో నారా లోకేష్ దీక్షకు దిగితే.. పవన్ కల్యాణ్ విశాకలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇప్పుడు చంద్రబాబు విజయవాడలో ఇసుక కొరతపై ఇసుక దీక్షకు దిగుతున్నారు. చంద్రబాబు లాంగ్ మార్చ్‌కు అన్నీ పార్టీల మద్దతు కోరారు పవన్ కల్యాన్. దీంతో విశాఖలో ఈనెల 3న జరిగిన లాంగ్ మార్చ్‌కు పలువురు టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.దీంతో ఇప్పుడు పవన్ మరి టీడీపీ చేస్తున్న ఇసుక దీక్షకు మద్దతు ఇస్తుందో లేదో చూడాలి.
Published by: Sulthana Begum Shaik
First published: November 13, 2019, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading