హోమ్ /వార్తలు /politics /

TDP Delhi Tour: టీడీపీ ఢిల్లీ టూర్.. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఫిక్స్.. మోడీ, షా టైమ్ ఇస్తారా..?

TDP Delhi Tour: టీడీపీ ఢిల్లీ టూర్.. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఫిక్స్.. మోడీ, షా టైమ్ ఇస్తారా..?

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

తెలుగుదేశం (Telugu Desham Party) కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై (Attack on TDP Office) ఢిల్లీలో (Delhi) ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో (Nara Chandra Babu Naidu) సహా 18 మంది నేతల బృందం సోమవారం ఢిల్లీ వెళ్లనుంది.

ఇంకా చదవండి ...

  తెలుగుదేశం (Telugu Desham Party) కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై (Attack on TDP Office) ఢిల్లీలో (Delhi) ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో (Nara Chandra Babu Naidu) సహా 18 మంది నేతల బృందం సోమవారం ఢిల్లీ వెళ్లనుంది. అదే రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టీడీపీ నేతలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారైంది. రాష్ట్రపతితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోజీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం కూడా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతలు, డ్రగ్స్, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనను కూడా విధించాలని కోరనున్నారు.

  ఢిల్లీ పర్యటన ఖరావడంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా రాష్ట్రపతిని కోరతామని ఆయన తెలిపారు. అలాగే ప్రధాని, హోం మంత్రి అపాయింట్ మెంట్ల కోసం యత్నిస్తున్నామని.. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాతమని తెలిపారు.

  ఇది చదవండి: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం… చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..


  మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే తెలిపింది. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కోరతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు టీడీపీ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎంను తిట్టించిన దానికి తీవ్రంగా స్పందించినందుకే రాష్ట్రపతి పాలన విధించాలా..? అని ప్రశ్నిస్తున్నారు. కుట్రతోనే సీఎంను బూతులు తిట్టించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీ రాజకీయలపై ఆర్జీవీ ట్వీట్... నేతలకు అదిరిపోయే సలహా..  ఇదిలా ఉండే శుక్రవారం విశాఖలోని జనాగ్రదీక్షలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అసత్య ఆరోపణలను రాష్ట్రప్రజలు నమ్మడం లేదని అందుకే ఢిల్లీ వెళ్తున్నారని విజయసాయి మండిపడ్డారు. అంతేకాదు సీఎం జగన్ ను గద్దె దించితే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని చంద్రబాబు.. బీజేపీ ముఖ్యనేతల వద్ద ప్రతిపాదన పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్రలో గంజాయి సాగును ప్రోత్సహించింది టీడీపీనేని ఆయన అన్నారు.

  ఇది చదవండి: వాలంటీర్లకు అలర్ట్.. అలా చేస్తే ఉద్యోగం పోవడం గ్యారెంటీ.. ఏపీ సర్కార్ వార్నింగ్..  ఇదిలా ఉంటే ఎన్టీఆర్ భవన్ పై దాడి చేసిన వారిలో 10మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్, శేషగిరి, అడపాల గణపతి, జోగ రమణ, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, పానుగంటి చైతన్య, గోక దుర్గాప్రసాద్, పేరూరి అజయ్, పల్లపు మహేష్ అనే వ్యక్తులను గుర్తించారు. అలాగే టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి జరిగిన కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP, Ysrcp

  ఉత్తమ కథలు