విజయవాడలో వైసీపీ ఎంపీకి షాక్

'అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. పరిపాలన వికేంద్రీకరణ వద్దు' అని వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

news18-telugu
Updated: February 2, 2020, 3:05 PM IST
విజయవాడలో వైసీపీ ఎంపీకి షాక్
వైసీపీ ఎంపీ నందిగం సురేష్
  • Share this:
విజయవాడలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నందిగామలో ఓ వైద్యుడిని కలిసేందుకు ఆయన వెళ్లిన సమయంలో ఆయన కారును టీడీపీకి చెందిన కొందరు అడ్డుకున్నారు. 'అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. పరిపాలన వికేంద్రీకరణ వద్దు' అని వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన కారును టీడీపీ కార్యకర్తలు ముందుకు కదలనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కొందరు ఆయన మీద దాడికి కూడా ప్రయత్నించినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని ఎంపీ సురేశ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

అంతకుముందు కృష్ణాజిల్లా నందిగామలో మీడియాతో మాట్లాడిన వైసీపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ చంద్రబాబు, బిజెపి, జనసేన కలిసి ప్రజలను మభ్యపెట్టి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారన్నారు. ప్రత్యేక హోదా విభజన సంబంధించిన విషయాలను బడ్జెట్లో పెట్టకపోవడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ ఒక్క ఎమ్మెల్యే కూడా కాపాడుకోలేక పోయారన్నారు ఎంపీ సురేష్. తన అభిమానులు తాకట్టు పెట్టి బీజేపీతో జత కట్టి నాలుగు సంవత్సరాలలొ బీజేపీతో విలీనం చేస్తారన్నారు. రెండు చోట్ల పోటీ చేసి సామాన్యులపై పవన్ కల్యాణ్ ఓడిపోయారన్నారు. శాసన మండలి రద్దును కేంద్రం ఆమోదించాలన్నారు. ఈ విషయంలో మహా అయితే కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అంశంపై కూడా ఎంపీ స్పందించారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమా తీస్తున్నారు. అంతే తప్పా ఆయన అంత సీను లేదన్నారు. వాళ్ల నాన్నగారి దగ్గర నుండి పార్టీని తీసుకున్న వారి బావగారి దగ్గర నుండి ఒక మంత్రి పదవిని కూడా సంపాదించలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీలో బాలకృష్ణకు విలువ లేదన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: February 2, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading