• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TDP LEADERS SLAMS YCP GOVERNMENT BIG SCAM ON SOLAR POWER TENDERS NGS

Andhra Pradesh: ఏపీలో లక్ష కోట్ల కుంభకోణం.. టీడీపీ నేతల సంచలన ఆరోపణలు

ఏపీలో సోలార్ పవర్ పేరుతో లక్ష కోట్ల కుంభకోణానికి ప్రయత్నమంటూ ఆరోపణలు

ఏపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పథకం వేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు అడ్డుకట్ట వేయకపోతే లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ జరిగేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

  • Share this:
    ఏపీలో లక్ష కోట్ల రూపాయల కుంభకోణానికి జగన్ ప్రభుత్వం పథకం రచించిందని తెలుగు దేశం ఆరోపించింది. సౌర విద్యుత్ టెండర్ల పేరుతో ఈ కుంభకోణానికి ప్లాన్ వేసిందని విమర్శించారు. ఈ టెండర్లను హైకోర్టు కొట్టివేయడంతో ఈ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందని.. దీంతో రాష్ట్రానికి, ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. పాత నిబంధనలు మొత్తం మార్చివేసి.. తమకు కావలసినప్పుడు టెండర్‌ రేటు పెంచుకోవడానికి.. టెండర్‌ పొందిన కంపెనీల యాజమాన్యాలను మార్చుకునేందుకు వెసులుబాట్లు కల్పించారని, దీని కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను కూడా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. 30 ఏళ్ల పాటు సౌర విద్యుత్‌ కంపెనీల నుంచి కరెంటు కొనుగోలుకు అనుమతిస్తూ జీవోలు ఇచ్చారు. ఆరు వేల మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినా మరో 50 శాతం సామర్థ్యంతో అదనపు యూనిట్లు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చేశారు. అంటే సుమారు పది వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు భారం రాష్ట్రంపై పడనుందని. ఈ విద్యుత్‌ కొనుగోలు కోసం రాష్ట్రం ఏటా కనీసం 4 వేల కోట్లు చెల్లించాలని. 30 ఏళ్లకు లక్షా ఇరవై వేల కోట్ల ప్రజా ధనం చెల్లించాలని. మిగిలిన రాష్ట్రాల్లో టెండర్లలో సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ 1.90కి పడిపోయిందని. ఇక్కడ మాత్రం 60 నుంచి 70 పైసలు అదనంగా చెల్లించేలా టెండర్లు ఖరారు చేయడానికి పథకం రచించారని ఆరోపించారు పట్టాభి..

    ప్రజా ధనాన్ని అడ్డుగోలుగా దోపిడీ చేయడానికి ఈ టెండర్లలో పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో ఏ మార్పు చేర్పులు చేయాలన్నా అది విద్యుత్‌ నియంత్రణ మండలి మాత్రమే చేయాలి. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం దీనిని స్పష్టంగా నిర్దేశిస్తోంది. కానీ ఈ టెండర్లలో ఆ నిబంధనను ఎత్తివేశారు. ఆ అధికారాన్ని రెగ్యులేటరీ కమిషన్‌ నుంచి తొలగించి అధికారుల కమిటీకి అప్పగించారు. ఒక ఐఏఎస్‌ అధికారి, ఒక చీఫ్‌ ఇంజనీర్‌, ఒక ఎస్‌ఈ, కంపెనీ ప్రతినిధి సభ్యులుగా ఉండే కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందట! తమకు కావలసిన అధికారులను ఈ కమిటీలో పెట్టుకుని.. టెండర్ల తరువాత నాలుగు రోజులు ఆగి ఈ రేట్లను మరింత పెంచుకునే కుట్ర ఇందులో దాగి ఉందిన్నారు. 30 ఏళ్లలో లక్ష కోట్ల కుంభకోణానికి ఈ ప్రక్రియ ఆస్కారం కల్పిస్తోందని పట్టాభి మండిపడ్డారు.

    ఇదీ సంగతి: త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ...? మంత్రుల్లో ఎవరు సేఫ్? కొత్తగా వచ్చేది ఎవరు..?

    ఉత్పత్తి ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మాత్రమే టెండర్‌ పొందిన కంపెనీల యాజమాన్యం మారడానికి పాత నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయని.. ఏపీ ప్రభుత్వం తాజా టెండర్లలో ఆ సమయాన్ని ఏడాదికే కుదించారని ఆరోపించారు. ఇప్పుడు ఎవరో ఒక బినామీతో టెండర్‌ వేయించి.. ఏడాది తర్వాత దానిని హస్తగతం చేసుకోవడానికే ఈ వెసులుబాటు పెట్టుకున్నారని ఆరోపించారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఏ అనుభవం లేని కడప జిల్లాకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అనే కంపెనీ టెండర్లలో పాల్గొని వేల మెగావాట్ల మేర ఉత్పత్తి చేయడానికి విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపికైందని.. ఈ కంపెనీ కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి బినామీ అని పట్టాభి చెప్పారు. టెండర్లు పిలిచిన కంపెనీకి ఆ అర్హత లేకపోవడం మరో విచిత్రమన్నారు. టెండర్లు పిలిచిన సంస్థకు నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ లైసెన్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ ఉండాలి. కానీ ఈ టెండర్లను పిలిచిన గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు ఏ లైసెన్సూ లేదు. అప్పటికప్పుడు ఊరకే ఒక కార్పొరేషన్‌ పెట్టి దాని పేరుతో టెండర్లు పిలిచారు. నిబంధనలను ఎంత ఘోరంగా తుంగలో తొక్కారో ఇదే ఉదాహరణ అన్నారు.
    Published by:Nagesh Paina
    First published: