బాలకృష్ణకు ఆ పదవి ఇస్తారా? ఇవ్వరా?.. చంద్రబాబుపై ఒత్తిడి

Nandamuri Bala Krishna | బాలకృష్ణకు రాయలసీమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీడీపీకి కూడా ఓట్ బ్యాంక్ ఉంది. వచ్చే ఐదేళ్ల పాటు దాన్ని కాపాడుకోవడం టీడీపీ ముందున్న సవాల్.

news18-telugu
Updated: July 13, 2019, 5:02 PM IST
బాలకృష్ణకు ఆ పదవి ఇస్తారా? ఇవ్వరా?.. చంద్రబాబుపై ఒత్తిడి
నందమూరి బాలకృష్ణ
news18-telugu
Updated: July 13, 2019, 5:02 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలనే ప్రతిపాదన పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీలో నేతలు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. బాలయ్యకు రాయలసీమలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీకి మళ్లీ పాత వైభవం వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 2014 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టీడీపీకి కేవలం మూడు సీట్లే వచ్చాయి. చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు, అనంతపురం జిల్లాలో బాలయ్య, పయ్యావుల గెలిచారు. కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.

బాలకృష్ణకు రాయలసీమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీడీపీకి కూడా ఓట్ బ్యాంక్ ఉంది. వచ్చే ఐదేళ్ల పాటు దాన్ని కాపాడుకోవాలంటే బాలయ్య లాంటి వ్యక్తి అయితేనే కరెక్ట్ అని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. ఒకవేళ ఇతర నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించినా.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీజేపీ వారిని తమ పార్టీలోకి లాక్కొనే అవకాశం ఉందనే విషయాన్ని టీడీపీ అగ్రనాయకత్వం కూడా ఆలోచిస్తోంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బాలయ్యకు రాయలసీమ పగ్గాలు అప్పగించాల్సిందేనంటూ టీడీపీ నేతలు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...