రాష్ట్రంలో జరగబోయో ఎన్నికల్లో ఏలాగైనా.. విజయం సాధించేందుకు అన్ని పార్టీలు.. ఎవరి వ్యూహ రచనలు వాళ్లు చేస్తున్నారు. అందులో భాగంగా.. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ.. కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. అందులోభాగంగా.. ఎలాగైనా కాపు ఉద్యమ నేత.. ముద్రగడ పద్మనాభంను ఒప్పించి తమ పార్టీలో చేర్చుకుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా కాపుల ఓట్లను టీడీపీ వైపు మళ్లించవచ్చునని..పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులోభాగంగా.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో కాపు జేఏసీ నేతలతో టీడీపీకి చెందిన నేతలు సమావేశం అయినట్టు తెలుస్తోంది.
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని.. ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తుని ఘటన తర్వాత కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను అరెస్ట్ చేయడం, ఆయన కుటుంబసభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిఠాపురం టీడీపీ టికెట్ కేటాయిస్తామని.. రాష్ట్రమంతా తిరిగి తమ పార్టీ తరుపున ప్రచారం చేయాలని ముద్రగడను టీడీపీ నేతలు కోరినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Mudragada Padmanabham, Tdp