కోడెల మృతిపై సీబీఐ విచారణ చేయాలి.. కిషన్ రెడ్డికి టీడీపీ విజ్ఞప్తి

కోడెల మరణంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదిక కోరతామని.. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కిషన్ రెడ్డి.

news18-telugu
Updated: September 17, 2019, 10:43 PM IST
కోడెల మృతిపై సీబీఐ విచారణ చేయాలి.. కిషన్ రెడ్డికి టీడీపీ విజ్ఞప్తి
కోడెల శివప్రసాదరావు
news18-telugu
Updated: September 17, 2019, 10:43 PM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతిపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. కోడెల మృతి బాధాకరమని.. ఆయన మృతిని నమ్మలేకపోతున్నామని అన్నారు.

కోడెల శివప్రసాదరావు మరణం బాధాకరం. ఏపీ ప్రభుత్వంపై మాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. రాజకీయ కక్షలతో అక్రమ కేసులు పెట్టడం సరికాదు. కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలి. వారికి ఏపీ ప్రభుత్వం సహకరించాలి. కోడెల శివప్రసాదరావు మృతిపై డీజీపీ, చీఫ్ సెక్రటరీ నుంచి సమగ్ర నివేదిక కోరతాం. ఆ తర్వాత కేంద్రం ఎలా ముందుకెళ్లాలన్న దానిపై హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.
కిషన్ రెడ్డి


కిషన్ రెడ్డిని కలిసిన వారిలో ఎల్.రమణ,రావుల చంద్రశేఖర్, కంభంపాటి, ఆలపాటితో పాటు ఇతర టీడీపీ నేతలు ఉన్నారు. కోడెల మరణంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదిక కోరతామని.. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కిషన్ రెడ్డి.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...