గవర్నర్‌ వద్దకు డ్రోన్ వివాదం... టీడీపీ నేతల ఫిర్యాదు

ఏపీలో వరదలు కారణంగా పంటలు అన్ని నష్టపోయాయన్నారు అచ్చెన్నాయుడు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వరదలు తప్పా ఏపీలో వర్షాలు పడలేదన్నారాయన.

news18-telugu
Updated: August 19, 2019, 3:54 PM IST
గవర్నర్‌ వద్దకు డ్రోన్ వివాదం... టీడీపీ నేతల ఫిర్యాదు
గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు
  • Share this:
ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ను కలిశారు టీడీపీ నేతలు. వరద సహాయక చర్యల్లో ప్రభత్వ విఫలమైందని ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా మాజీమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గోదావరి కృష్ణా నదుల వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు పిచ్చి పట్టిందని ఆరోపించారు. చంద్రబాబు నివాసాన్ని,చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ఫ్లడ్ మానేజ‌్‌మెంట్ చేశారని విమర్శించారు. కృష్ణా నదికి వరదలు వస్తాయని cwc హెచ్చరించిన ఏపీ ప్రభుత్వానికి పట్టలేదన్నారు. ఏపీలో వరదలు కారణంగా పంటలు అన్ని నష్టపోయాయన్నారు అచ్చెన్నాయుడు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వరదలు తప్పా ఏపీలో వర్షాలు పడలేదన్నారాయన.


వచ్చిన వరద నీటిని ఎపి ప్రభుత్వం వినియోగించుకోలేక పోయిందని ఆరోపణలు చేశారు. గోదావరికి వరద వచ్చినప్పుడు జెరూసలేం,కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు సీఎం అమెరికా విహారాయాత్రలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజీలో 40టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వినియోగించుకుంటే నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నివాసం చుట్టు మంత్రులు చక్కర్లు కొడుతున్నారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రిచంద్రబాబు నివాసంపై డ్రోన్ తో విజువల్ తీసుకోవడానికి మీకు అధికారం ఎవ్వరు ఇచ్చారంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాష్ట్రంలో శాడిస్ట్ విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు మరో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోలవరానికి వరదలు వచ్చినప్పుడు ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడలేదన్నారు. చంద్రబాబు నివాసంలోకి నీళ్లు రావాలని నీటిని నిలిపి దిగువకు విడుదల చేసారని ఆరోపించారు. వరదలపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చెయ్యలేదని విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం పోతిరెడ్డిపాడు,మచ్చుమర్రి ద్వారా నీటిని అందించలేకపోతుంది. ఏపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు గోరంట్ల.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading