రాయలసీమపై కోపం తగ్గిందా ?... టీడీపీ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ

అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

news18-telugu
Updated: June 18, 2019, 3:52 PM IST
రాయలసీమపై కోపం తగ్గిందా ?... టీడీపీ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ
తెలుగుదేశం పార్టీ లోగో
news18-telugu
Updated: June 18, 2019, 3:52 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా... లాబీల్లో కలుసుకున్న ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రాయలసీమపై ఇప్పటికైనా కోపం తగ్గిందా ? అంటూ జేసీ దివాకర్ రెడ్డి యనమలను ప్రశ్నించారు. అందుకు స్పందించిన యనమల రామకృష్ణుడు... మీవల్లే నష్టం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అయితే యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి చేసినవా ? లేక రాయలసీమను ఉద్దేశించి చేసినవా ? అన్నది మాత్రం తెలియరాలేదు.

తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు ఎంతో చేశామని భావించిన టీడీపీ... రాయలసీమలోని మొత్తం నాలుగు జిల్లాల్లో కలుపుకుని కేవలం మూడు సీట్లు రావడంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు. అయితే రాయలసీమలో టీడీపీ సభ్యులు పెద్దగా గెలుపు సాధించలేదనే కోపంతోనే జేసీతో యనమల ఈ రకంగా మాట్లాడి ఉంటారని పలువురు భావిస్తున్నారు. బహిరంగంగా ఏదంటే అది ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించటంతో పార్టీకి తీరని నష్టం జరిగిందనే అభిప్రాయంతో సెటైర్ వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి యనమల వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియాలంటే... దీనిపై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...