Home /News /politics /

TDP LEADERS GOTTIPATI RAVI KUMAR AND POTULA RAMARAO GETS RELIEF FROM HIGH COURT IN GRANITE MINING LEASE BA GNT

టీడీపీ నేతలు గొట్టిపాటి రవి, పోతుల రామారావుకు ఊరట, జగన్ ప్రభుత్వానికి షాక్

చంద్రబాబుతో గొట్టిపాటి రవి (File)

చంద్రబాబుతో గొట్టిపాటి రవి (File)

AP High Court on TDP Leaders Mining lease: ప్రకాశం జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది.

    Gottipati Ravi and Potula RamaRao | ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలో మైనింగ్ లీజుల రద్దు విషయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి హైకోర్టులో ఊరట లభించింది. ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మైనింగ్ లీజులు రద్దు చేస్తూ గతంలో ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుదేశంతో లీజులు రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

    అసలు ఏం జరిగింది?
    ప్రకాశం జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీ లీజులు రద్దు చేసింది. క్వారీయింగ్‌లో లోపాలు ఉన్నాయని ఇద్దరు నేతల క్వారీల లీజు రద్దు చేసింది. ఎమ్మెల్యే గొట్టిపాటికి చెందిన ఐదు క్వారీలు, సన్నిహితులకు సంబంధించిన ఆరు క్వారీల లీజు రద్దయ్యాయి. పోతుల రామారావుకు సంబంధించిన ఒక క్వారీ లీజు రద్దైంది. అంతేకాదు గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో జరిమానాలు విధించగా.. లీజులే రద్దు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. లీజులు రద్దుకు సంబంధించిన నోటీసులు రాగానే టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

    ఎమ్మెల్యే గొట్టిపాటి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గతంలో వైసీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి గొట్టిపాటి, కందుకూరు నుంచి పోతుల రామారావు వైసీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఇద్దరూ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నిల్లో ఇద్దరు టీడీపీ నుంచి పోటీచేయగా, గొట్టిపాటి రవి విజయం సాధించారు. పోతుల రామారావు ఓడిపోయారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు