‘విలీనం కాదు ఫిరాయింపు’.. న్యాయపోరాటం చేస్తామన్న టీడీపీ

పార్టీ మారిన ఎంపీల మీద టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. వారంతా చచ్చు దద్దమ్మలు అంటూ మండిపడ్డారు.


Updated: June 20, 2019, 9:54 PM IST
‘విలీనం కాదు ఫిరాయింపు’.. న్యాయపోరాటం చేస్తామన్న టీడీపీ
బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్
  • Share this:
రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం చెల్లదని, ఆ నలుగురు ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు పార్టీ ఫిరాయించినట్టేనని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు టీడీపీపీ లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చారని, టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తమను కనీసం పిలవకుండా, తమ అభిప్రాయం తీసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని మరో ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ అనేది ఒక ఎన్నికతో పుట్టింది కాదని.. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్ షేర్ వచ్చిందని చెప్పారు. తాము ఐదుగురు (గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, సీతా రామలక్ష్మి) టీడీపీ వెంటే ఉన్నామని చెప్పారు. ఈ సంక్షోభాన్ని హ్యాండిల్ చేస్తామని పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎంపీలు చెప్పారు.

పార్టీ మారిన ఎంపీల మీద టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. వారంతా చచ్చు దద్దమ్మలు అంటూ మండిపడ్డారు. అధికారం ఉంటే అనుభవించడానికి పనికొస్తారు తప్ప.. వారంతా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయలేని దద్దమ్మలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ వెంకటేష్ తప్ప మిగిలిన ముగ్గురూ కనీసం పంచాయతీ బోర్డు సభ్యులుగా కూడా గెలవలేరని అన్నారు. వారిని ప్రజల్లో తిరగనివ్వబోమని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

ఆర్థిక సమస్యలు, సీబీఐ, ఈడీ కేసులకు భయపడి వారు బీజేపీలోకి వెళ్లినట్టు తెలుస్తోందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గతంలో శరద్ యాదవ్ విషయంలో రాజ్యసభ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే వేటు వేయాలని పిలుపునిచ్చారు.

First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు