Home /News /politics /

TDP LEADERS EYS ON JANASENA FOR NEXT ELECTIONS ALREADY THEY TOUCHED WITH JANASENA LEADERS NGS

Tdp vs Janasena: టీడీపీ కన్నా జనసేన బెటర్ అంటున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పటి నుంచే పక్క చూపు

చంద్రబాబు-పవన్

చంద్రబాబు-పవన్

Tdp leaders eyes on Janasena: వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో ఉండడం కంటే.. జనసేనకు వెళ్లడమే బెటరా..? ప్రస్తుతం చాలామంది టీడీపీ లీడర్లు చర్చించుకుంటున్న అంశం ఇదే అని టాక్ వినిపిస్తోంది. చాలామంది సీనియర్ నేతలు సైతం ఇప్పటికే జనసేనలో కర్చీఫ్ వేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎందుకు సీనియర్ నేతలు సైతం జనసేన బెటర్ అంటున్నారు..?

ఇంకా చదవండి ...
  Andhra Pradesh Politics: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ (Andhra Pradesh Politics) లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది.. ఏ పార్టీలో ఉంటే బెటర్ అంటూ లెక్కలు వేసుకుంటున్నారు కొందరు నేతలు. వైసీపీ సర్కారు (YCP Government)అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన టీడీపీ ఆ పనిని సరిగ్గా నిర్వర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తప్ప టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. దీంతో ఆపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం క్రమంగా ఆ పార్టీ గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy)కి జై కొట్టగా మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లడం ఇష్టం లేని నేతలు.. బీజేపీ(BJP)లో చేరినా పెద్దగా లాభం ఉండదని భావిస్తున్నారు.. అందుకే వారంతా ఇప్పుడు జనసేన (Janasena) వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ముందస్తుగానే అలర్ట్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే టీడీపీ వచ్చే ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే సాహసం చేయదని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra babu)సైతం గత కొద్దిరోజులుగా పొత్తులపై ఇలాంటి సంకేతాలనే ఇస్తున్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని టీడీపీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

  ఇదీ చదవండి: భారీ వర్షాలతో రైతన్నలకు తప్పని కష్టాలు.. ఉద్యానం చుట్టూ.. తెగుళ్ల ముసురు

  ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరణగా చూపిస్తున్నారు. టీడీపీలో ఒకరిద్దరు నేతలకు మినహాయించి మిగిలిన నేతలకు ఇటీవల ప్రాధాన్యం లభించడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ముందుగానే జనసేనలో కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ జిల్లాల్లో జనసేన బలంగా ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లను జనసేనను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఈ జిల్లాల్లోని టీడీపీ నేతల సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం నెలకొంది.

  ఇదీ చదవండి: మీ పని మాది అంటున్న యాప్స్.. బూజు దులిపే దగ్గర నుంచి హెయిర్ కటింగ్ వరకు అన్నీ ఇంటి దగ్గరే.. ఏపీలో పెరిగిన డిమాండ్

  ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు ముందుగానే జనసేన వైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ నేతలు ముందుగానే జనసేనలోకి వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. కాకినాడ రూరల్, రాజానగరం నియోజకవర్గ నేతలు ఇప్పటికే టీడీపీ గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని టాక్ విన్పిస్తోంది. వైసీపీని ఓడించాలంటే జనసేనలోకి వెళ్లడమే ఉత్తమమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాలకు చెందిన నేతలు జనసేన వైపు చూస్తున్నారు.

  ఇదీ చదవండి: ఆధ్యాత్మిక ప్రత్యేకతే కాదు.. జమ్మి చెట్టుతో ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలు.. ఆ ప్రాంతవాసులకు కల్పవృక్షం.. ఎందుకంటే

  2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటుకే పరిమితమైనా గోదావరి జిల్లాలో మాత్రం మంచి ఓటు బ్యాంకును దక్కించుకొంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థానాలను దక్కించుకుంది. దీనికితోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కొద్దిరోజలుగా జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో జనసేనపై ప్రజల్లో క్రమంగా నమ్మకం పెరుగుతోంది. జనసేన-టీడీపీ పొత్తు ఖరారు కాక ముందే ఆపార్టీ నేతలు ముందుగానే ఆపార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండటం విశేషం. అయితే ఈ ఏరియాల్లో జనసేన బలంగా ఉండటంతో పవన్ కల్యాణ్ వీరికి ఆశ్రయం కల్పిస్తారా? లేదా అన్నది చూడాలి..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Janasena, Pawan kalyan, Tdp, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు