చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ... టీడీపీ ఆందోళన

చంద్రబాబు నివాసానికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫోటోలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఫోటోలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 11:53 AM IST
చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ... టీడీపీ ఆందోళన
చంద్రబాబు, లింగమనేని గెస్ట్ హౌస్
  • Share this:
ఏపీలోని టీడీపీ అధినేత నివాసమైన ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్‌లోకి కృష్ణానది వరద నీరు వచ్చిన సంగతి తెలిసిందే. కరకట్టకు ఆనుకుని ఈ ఇంటికి వరద ముప్పు ఉండటం వల్లే చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నివాసానికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫోటోలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఫోటోలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే చంద్రబాబు నివాసాన్ని డ్రోన్ కెమెరాలతో ఎలా ఫోటోలు తీస్తారని టీడీపీ నేతలు అధికారులపై మండిపడుతున్నారు.

మరోవైపు ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీతో పాటు గుంటూరు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. హై సెక్యూరిటీ జోన్‌లో ఈ రకంగా డ్రోన్లను ఎలా వినియోగిస్తారని ఆయన వారిని ప్రశ్నించినట్టు సమాచారం. డ్రోన్ల వినియోగానికి ప్రభుత్వం లేదా డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని... మీరు ఎవరికైనా అనుమతి ఇచ్చారా అని చంద్రబాబు డీజీపీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చడంపై డీజీపీపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఒక మాజీ సీఎం ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీసేముందు అనుమతి తీసుకోరా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు టీడీ జనార్థన్, దేవినేని అవినాష్ ఇదే విషయంపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి మరింతగా పెరగడంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు