ప్రజాస్వామ్యంలో అధికార మార్పులు జరుగుతాయి కానీ వ్యవస్థలో మార్పురావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు టీడీపీ నాయకులను, కార్యకర్తలను బ్రతకనివ్వడం లేదంటూ వారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలసి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ను హుందాతనంగా నడిపితే, వైసీపీ ప్రభుత్వంలో ఏవిధంగా నడుస్తుందో చూస్తున్నామని, వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బ్రతకటమే కష్టంగా ఉందన్నారు. వైసీపీ నాయకులు సీఎం పేషీ నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు టీడీపీ మీద ఇష్టం వచ్చినట్లు అవమానకరంగా , అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని తెలియజేసారు. దీనిపై రెండు పుస్తకాలు పోలీసులకు అందజేసి చర్యలు తీసుకోమంటే పట్టించుకోలేదన్నారు. వ్యవస్థ మీద ఇంకా టీడీపీకి నమ్మకం ఉందని, గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సహకరించిన అధికారుల పరిస్థితి, IAS అధికారులు కూడా కష్టాలు తెచ్చుకున్న పరిస్థితి చూశామన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు ఏవిధంగా ఉన్నా, అధికారులు మాత్రం చట్టానికి విధేయులై ఉండాలని హితవు పలికారు.
మాచర్లలో జరిగిన సంఘటన అప్రజాస్వామికమని, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోకపోతే టీడీపీ కార్యకర్తలు చూస్తు ఊరుకోరని హెచ్చరించారు. ఎక్కడో, ఎప్పుడో సామాన్య కార్యకర్త ఎదో పోస్టింగ్ పెడితే లోకేష్ కి ఏం సంబంధమని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థలో కొందరు అధికారులు అత్యుత్సహంతో అధికార పార్టీపై కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. టీడీపీ కి సంబంధించిన బలహీన వర్గాలవారిని వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసు స్టేషన్లు చుట్టూ తిప్పుకుంటుంన్నారని విమర్శించారు. మాచర్ల నియోజవర్గంలో ఇద్దరు స్నేహితులు బైక్ మీద వెళుతూ యాక్సిడెంట్ ఐతే, దాన్ని మర్డర్ కేసుగా స్థానిక MLA నమోదు చేయించారన్నారు. ఈ విషయం పై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.