గణేష్ ఉత్సవాల్లో వైసీపీ ఎమ్మెల్యేకు అవమానం..కులం పేరుతో దూషించిన..

టీడీపీ నేతల వ్యాఖ్యలతో తీవ్ర మనస్థాపానికి గరైన శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. దాంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

news18-telugu
Updated: September 2, 2019, 7:45 PM IST
గణేష్ ఉత్సవాల్లో  వైసీపీ ఎమ్మెల్యేకు అవమానం..కులం పేరుతో దూషించిన..
వుండవల్లి శ్రీదేవి
  • Share this:
వినాయక చవితి ఉత్సవాల్లో వైసీపీ దళిత ఎమ్మెల్యే శ్రీదేవికి అవమానం జరిగింది. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు శ్రీదేవిని కులం పేరుతో దూషించారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దళితులు మండపంలోకి వస్తే వినాయకుడు మైలపడతాడంటూ కుల దురంహకార వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతల వ్యాఖ్యలతో తీవ్ర మనస్థాపానికి గరైన శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. దాంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

దళిత మహిళ అని కూడా చూడకుడా టీడీపీ నేతలు దూషించారు. అణగారిన వర్గాల పట్ల టీడీపీ నేతలకు చిన్నచూపు. ఎమ్మెల్యే పట్లే ఇలా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితేంటి? ఎవరినో ఒకరిని దూషిస్తూ వైసీపీ ప్రభుత్వంపై బుదర జల్లాలని చూస్తున్నారు. కుల వివక్ష చాలా భయంకరంగా ఉంది. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తా.
శ్రీదేవి


ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధిని కులం పేరుతో దూషిస్తారా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
First published: September 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు