Home /News /politics /

TDP LEADER YARAPATHINENI SRINIVASARAO FIRE ON MINSTER KODALI NANI IN GUNTURU NGS

Andhra Pradesh: అధికారంలోకి వస్తే ఆ మంత్రిని అంకుశంలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తా.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

మంత్రి కొడాలిపై యరపతినేని సంచలన వ్యాఖ్యలు

మంత్రి కొడాలిపై యరపతినేని సంచలన వ్యాఖ్యలు

అధికారంలోకి వచ్చిన గంటలోనే ఆ మంత్రిని.. అకుంశం సినిమాలోని విలన్ రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తాను అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరా మంత్రి..?

    ఏపీలో అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సమయంలో కనిపించే వాతావరణం ఇప్పుడే కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వానికి తోడు.. విమర్శలు, ప్రతి విమర్శలతో పరిస్థితి వేడెక్కింది. అయితే ముఖ్యంగా మాటలు తూటాలు పేల్చడంలో మంత్రి కొడాలి నానిని మించిన వారు లేరనే చెప్పాలి.. అవకాశం వస్తే చాలు చంద్రబాబు, లోకేష్ లపై ఒంటికాలుతో లేస్తారు. ఆయన డైలాగ్ లను కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక్కసారి విమర్శల దాడి మొదలెట్టారు అంటే దానికి బ్రేకులు ఉండవు.. అందుకే ఇప్పుడు టీడీపీ నేతలందరికీ ఆయనే ప్రధాన టార్గెట్ అయ్యారు. ఏ టీడీపీ నేత మాట్లాడినా ముందు మంత్రి కొడాలి నాని ప్రస్తావనే తెస్తారు. తాజాగా మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్‌ నేత యరపతినేని నివాసరావు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంటలోనే ప్రతాపం చూపిస్తామని.. మంత్రి కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు.

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేస్తే.. ఇక, మంత్రులు.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న యరపతినేని శ్రీనివాసరావు.. మంత్రి కొడాలిపై చేసిన హాట్ కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మరి దీనికి ఫైర్ బ్రాండ్ అంబాసిడర్ మంత్రి కొడాలి నాని ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి..

    ఇప్పుడే కాదు గత కొన్ని రోజుల నుంచి యరపతి నేని కోడాలి నానిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల దాచేపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆయన మంత్రి కొడాలి సహా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పది రోజులు జైలులో ఉంచితే వైసీపీ నేతలను వంద రోజులు జైలులో ఉంచుతాను అంటూ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. తనపై అక్రమ కేసులు పెడుతుందని, తాను కేసులకు భయపడబోనని యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే ఎన్నికల తరువాత తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodali Nani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు