ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు నెలల్లో 12 రకాలుగా దోచుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అంతే కాకుండా భూముల అమ్మకం ముసుగులో జగన్ మోహన్ రెడ్డి వారి అనుచరులకు కట్టబెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసారు. రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్ర అభివృద్ధినే రివర్స్ చేసారని యనమల వైసీపీ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయనని... ఇందుకు మాజీ స్పీకర్ కోడెల శిపవ్రసాదరావు ఆత్మహత్యే సాక్ష్యం అని యనమల వ్యాఖ్యానించారు.
మరోవైపు చంద్రబాబు చేసిన దీక్షకి వైసీపీ ప్రభుత్వం భయపడింది అని మాజీమంత్రి దేవినేని ఉమ అన్నారు. 151 సీట్లు ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం అభద్రతా భావంతో వున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి ప్రతి పక్ష హోదా లేకుండా చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని దేవినేని ఉమ ఆరోపించారు. వారు ఎంతమంది వున్నా టీడీపీ నేతలపై విమర్శలు చేయడానికి ధైర్యం సరిపోవడం లేదని విమర్శించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.