జగన్ సర్కారు పేదల రక్తాన్ని పిండుకుంటోంది.. యనమల ఫైర్..

మద్యం ధరలను పెంచుతూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కరోనా ఉన్న సమయంలో ధరలు పెంచడం ఏంటని నిలదీసింది.

news18-telugu
Updated: May 4, 2020, 11:28 AM IST
జగన్ సర్కారు పేదల రక్తాన్ని పిండుకుంటోంది.. యనమల ఫైర్..
యనమల రామకృష్ణుడు, సీఎం జగన్
  • Share this:
మద్యం ధరలను పెంచుతూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కరోనా ఉన్న సమయంలో ధరలు పెంచడం ఏంటని నిలదీసింది. మద్యం ధరలు 25 శాతం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. ఈ సమయంలో ఆపన్నులను ఆదుకోవాలని, అలాంటిది ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం మోపడం ఏంటని ప్రశ్నించింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ధరలను పెంచిందని, భారీగా ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. మద్యం కంపెనీల మేళ్ల కోసం, కమిషన్ల కోసమే ప్రజారోగ్యంతో జగన్ ప్రభుత్వం చెలగాటం అడుతోందని అన్నారు.

రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందని, నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులే నాటు సారా తయారీ వెనుక ఉన్నారని, వలంటీర్లతో అమ్మిస్తున్న దృశ్యాలను మీడియాలో చూశామని అన్నారు. ధరల పెంపుతో నాటు సారా మరింత పెరుగుతుందని చెప్పారు. ఆర్టీసి ఛార్జీల పెంపు, కరెంట్ బిల్లుల పెంపు, ఇసుక ధర పెంపు.. ఇప్పుడు మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోడమేనని విమర్శించారు. దశలవారీ మద్య నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెద్ద ఎత్తున తెరిచిందని యనమల ఆరోపించారు. మద్యం ధరల నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
First published: May 4, 2020, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading