జగన్ శవ రాజకీయాలు వివేకా కూతురుకు తెలుసు: వర్ల రామయ్య

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తుపై వివేకానందరెడ్డి కూతురు సునీతకు ఉన్న నమ్మకం జగన్‌కు లేకుండా పోయిందన్నారు.

news18-telugu
Updated: March 20, 2019, 3:38 PM IST
జగన్ శవ రాజకీయాలు వివేకా కూతురుకు తెలుసు: వర్ల రామయ్య
వర్ల రామయ్య, ఆర్టీసీ ఛైర్మన్
  • Share this:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తుపై వివేకానందరెడ్డి కూతురు సునీతకు ఉన్న నమ్మకం జగన్‌కు లేకుండా పోయిందన్నారు. జగన్‌ది శవరాజకీయాలు చేసిన చరిత్ర అని ఆయన దుయ్యబట్టారు. తండ్రి వైఎస్ చనిపోయినప్పుడు శవం ఇంటికి రాకముందే... ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ రాజకీయాలు చేశారన్నారు. జగన్ గురించి తెలిసే... తన తండ్రి చావును రాజకీయం చేయోద్దని సునీత చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం జగన్ ఎంతటికైనా దిగజారుతారన్నారు. వైఎస్ వివేకాను ఎందుకు హత్య చేశారో ? ఎవరు హత్య చేశారో జగన్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు, లోకేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డిపై అనవసర విమర్శలు, ఆరోపణలు చేశారన్నారు. వాళ్లందరికీ జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లు సాధించుకునేందుకే జగన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సిట్ దర్యాప్తు సక్రమంగా జరుగుతున్నప్పుడు సీబీఐ దర్యాప్తును జగన్ కోరాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు మిస్టరీ మరికొద్దిగంటల్లో తేలిపోతుందన్నారు వర్ల రామయ్య.

ఐదురోజుల క్రితం పులివెందులలోని తన సొంత నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బాత్‌రూంలో రక్తపు మడుగులోపడి ఉన్న వివేకాను చూసిన పీఏ కృష్ణారావు పోలీసులకు ఫిర్యోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టు మార్టమ్ అనంతరం వివేకాది హత్యగా తేల్చారు. ప్రస్తుతం వివేకా మర్డర్ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తోంది.First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు