కోడెల చేసింది ముమ్మాటికీ తప్పే... టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను కోడెల శివప్రసాద్ రావు తన ఇంటికి తీసుకెళ్లడాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య తప్పుబట్టారు.

news18-telugu
Updated: August 21, 2019, 4:48 PM IST
కోడెల చేసింది ముమ్మాటికీ తప్పే... టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు
కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు తీరును తప్పుబట్టారు ఆ పార్టీ నేత వర్ల రామయ్య. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల తన నివాసాలకు తరలించుకోవడం ఏ మాత్రం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. కోడెల చర్యల వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారిందని ఆయన అన్నారు. అప్పుడు ఫర్నీచర్ తీసుకెళ్లి... ఇప్పుడు తిరిగి తీసుకెళ్లండని ఆయన అనడం ఏ మాత్రం సహేతుకం కాదని వర్ల రామయ్య తెలిపారు.అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శికి కూడా ఈ విషయాన్ని కోడెల ఎందుకు చెప్పలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. కోడెల ఈ రకంగా చేయకుంటే ఉంటే బాగుండేదన్నది తన అభిప్రాయమని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా పార్టీ పరువును మాత్రం కోడెల తీశారంటూ వర్ల రామయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీని అమరావతికి తరలించారు. అయితే ఆ సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌లో కొంతమేర కోడెల శివప్రసాదరావు తన సొంత నివాసాలకు తరలించుకున్నారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివ ప్రసాద్ కొన్నింటిని సత్తెనపల్లి, నర్సరావుపేటకు తరలించుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు