హోమ్ /వార్తలు /National రాజకీయం /

జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)

జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)

తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని.. తమ నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ అని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

  టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని.. తమ నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీలపై వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఇటీవల సొంత పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ ఎందుకు పట్టించుకోవడం లేదని పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

  లోకేశ్ జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఎందులోనూ పోటీ పడలేడని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ అంశంపై టీడీపీలో ఇప్పటివరకు నాయలెవరూ స్పందించలేదు. దీనిపై పరోక్షంగా స్పందించిన నారా లోకేశ్... 2009 ఎన్నికల సందర్భంగా జరిగిన అంశాల గురించి ఇప్పుడు మాట్లాడటం ఎందుకని దీనిపై సమాధానం దాటేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమకు లేదని టీడీపీ నేత వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Jr ntr, TDP, Varla ramaiah

  ఉత్తమ కథలు