వైఎస్ హరితాంధ్ర, చంద్రబాబు స్వర్ణాంధ్ర, జగన్ మాత్రం... టీడీపీ సెటైర్లు..

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యాంధ్రప్రదేశ్ కోసం తపిస్తుండడం దుర్మార్గం అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.

news18-telugu
Updated: May 6, 2020, 9:02 PM IST
వైఎస్ హరితాంధ్ర, చంద్రబాబు స్వర్ణాంధ్ర, జగన్ మాత్రం... టీడీపీ సెటైర్లు..
ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యాంధ్రప్రదేశ్ కోసం తపిస్తుండడం దుర్మార్గం అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. వైఎస్ హరితాంధ్రప్రదేశ్, చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్‌ కోసం శ్రమించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మద్యం దుకాణాలు మళ్లీ ప్రారంభించడంతో మందుబాబుల దాడుల్లో భార్యల పుస్తెలు తెగుతున్నాయన్నారు. మద్యం వల్ల కొందరు భర్తల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్నారు. మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలన్న మహిళల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించాలని వర్ల రామయ్య అన్నారు. కరోనా కట్టడి చేయకుండా మద్యం విక్రయాలేంటని ప్రశ్నిస్తున్న మహిళలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం కొత్త బ్రాండ్ల ప్రవేశం, తయారీ, నాణ్యత, అమ్మకాలపై సీబీఐ విచారణకు ఆదేశాలివ్వాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గతంలోలేని బ్రాండ్ల అమ్మకాలతో మద్యంప్రియుల ప్రాణాలకు భరోసా ఏదని ప్రశ్నించారు. 42 రోజుల లాక్ డౌన్ విరామాన్ని మద్యనిషేధానికి సద్వినియోగంలో విఫలం అయిందన్నారు. మందుబాబుల బలహీనతను ఖజానా నింపుకోడానికి ప్రయత్నించడం నీచం అని టీడీపీ నేత మండిపడ్డారు. మద్య నిషేధంతో వచ్చే రూ.5కోట్ల నష్టాన్ని మరో రకంగా పూడ్చుకోవాలని సూచించారు.
First published: May 6, 2020, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading