సీఎం జగన్‌పై వంగవీటి రాధా తీవ్ర విమర్శలు..

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత వంగవీటి రాధా తీవ్ర విమర్శలు చేశారు. ఏ జిల్లాలో జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

news18-telugu
Updated: January 14, 2020, 3:04 PM IST
సీఎం జగన్‌పై వంగవీటి రాధా తీవ్ర విమర్శలు..
వంగవీటి రాధా
  • Share this:
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత వంగవీటి రాధా తీవ్ర విమర్శలు చేశారు. ఏ జిల్లాలో జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అమరావతిలోని తుళ్లూరు మహిళలు ఈ రోజు రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. వారికి వంగవీటి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ 30 రాజధానులు అనుకున్నా ఫర్వాలేదని, తమకు తెలిసింది మాత్రం ఒకటే రాజధాని అని.. ఒకటే రాష్ట్రమని వ్యాఖ్యానించారు. ఆయనతో మందడం మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసులు తమపై దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ను కలిసిన రాధా.. చాలా విరామం తర్వాత ఆందోళనల్లో పాల్గొనడంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు మరింత మద్దతు పెరిగిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 14, 2020, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading