చంద్రబాబు కోసం వంగవీటి పూజలు... మరోసారి సీఎం కావాలంటూ శ్రీయాగం

ఆదివారం ఉదయం రాధా సోదరి ఆశా, ఆమె భర్త కలిసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గోపూజ, వాస్తు హోమం నిర్వహించి శ్రీయాగాన్ని మొదలపెట్టారు.

news18-telugu
Updated: April 1, 2019, 8:00 AM IST
చంద్రబాబు కోసం వంగవీటి పూజలు... మరోసారి సీఎం కావాలంటూ శ్రీయాగం
చంద్రబాబు, వంగవీటి రాధాక్రిష్ణ
  • Share this:
ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి... చంద్రబాబు కోసం పూజలు చేస్తున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ మూడురోజుల పాటు శ్రీయాగం నిర్వహిస్తున్నారు. తన చెల్లెలు, బావతో కలిసి ఈ యాగం చేయిస్తున్నారు వంగవీటి. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణమంటపంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం రాధా సోదరి ఆశా, ఆమె భర్త కలిసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గోపూజ, వాస్తు హోమం నిర్వహించి శ్రీయాగాన్ని మొదలపెట్టారు. రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీయాగం పూర్ణాహుతితో ముగియనుంది. ఏప్రిల్ మూడుతో ఈ యాగం పూర్తికానుంది. శ్రీయాగం చేయడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్నారు వంగవీటి. శత్రుపీడ, సంకల్ప సిద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు మరోసారి సీఎం కావాలన్న కోరికతోనే ఈ యాగం చేస్తున్నట్లు వివరించారు.

ఇటీవల రాజకీయ నేతల హోమాలు, యాగాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధించడానికి యాగమే కారణమని ప్రచారం జరిగింది. దీంతో ఏపీలోనూ ఎన్నికల వేళ యాగాలు, హోమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ సైతం రాజశ్యామల యాగం చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. మార్చి 27నుంచి 29 వరకు నెల్లూరు జిల్లాలో ఈ యాగాన్ని నిర్వహించినట్టు సమాచారం. ఈ యాగం విషయాన్ని జగన్ కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ఆ కుటుంబానికి సన్నిహితుడైన ఎంపీ ఒక్కరే ఈ యాగంలో పాల్గొన్నారు.
First published: April 1, 2019, 8:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading