ఏపీ వాలంటీర్లపై మండిపడ్డ టీడీపీ నేత

మహిళల కన్నీరు జగన్ ప్రభుత్వానికి శాపంగా మారబోతోందని టీడీపీ నాయకురాలు అనిత విమర్శించారు.

news18-telugu
Updated: June 4, 2020, 5:52 PM IST
ఏపీ వాలంటీర్లపై మండిపడ్డ టీడీపీ నేత
వంగలపూడి అనిత (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాలికలు, మహిళలపై వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాలంటీర్ల అరాచకాలకు జనం భయపడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందుగా జగనన్న వస్తాడని ఆటో పంచ్‌లు వేసిన వారంతా ఎక్కడున్నారని పరోక్షంగా రోజాపై విమర్శలు చేశారు. ప్రతి దానికీ గొంతు చించుకునే మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఏమయ్యారని అనిత ప్రశ్నించారు. ఏపీలో మహిళా హోంమంత్రి ఉండి కూడా ఆడకూతుళ్లకు భద్రత లేదని ఆమె ఆరోపించారు.

మహిళలను సొంత చెల్లెళ్లలా చూసుకోవడమంటే ఇదేనా అని అనిత సీఎం జగన్‌ను ప్రశ్నించారు. మహిళల కన్నీరు జగన్ ప్రభుత్వానికి శాపంగా మారబోతోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాలంటీర్లను రక్షిస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. ఏడాది పాలనలో ఏం సాధించారని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని అనిత ప్రశ్నించారు.
Published by: Kishore Akkaladevi
First published: June 4, 2020, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading