జగన్ పాలన బాగుందన్న టీడీపీ మాజీ ఎంపీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 1:03 PM IST
జగన్ పాలన బాగుందన్న టీడీపీ మాజీ ఎంపీ
ఏపీ సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: August 16, 2019, 1:03 PM IST
నరసరావుపేట మాజీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పనితీరు పట్ల సానుకూలంగా స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాయపాటి... రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన బాగుందని వ్యాఖ్యానించారు. అయితే జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరించలేదని రాయపాటి అభిప్రాయపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్టు వార్తలపై కూడా ఆయన స్పందించారు. పార్టీ మారే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ రీ టెండరింగ్ నిర్ణయం సరికాదని రాయపాటి వ్యాఖ్యానించారు.

Rayapati comments on ap cm ys jagan, rayapati joins bjp, rayapati sambasiva rao, ap cm ys jagan mohan reddy, tdp, ysrcp, polavaram reverse tendering, bjp, సీఎం జగన్‌పై రాయపాటి ఆసక్తి వ్యాఖ్యలు, రాయపాటి సాంబశివరావు, సీఎం వైఎస్ జగన్, టీడీపీ, వైసీపీ, పోలవరం
రాయపాటి సాంబశివరావు (file)


ఇలా చేయడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న రాయపాటి... బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ స్వయంగా రాయపాటి ఇంటికి వచ్చిన ఆయనను పార్టీలోకి ఆహ్వానించారనే వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి తన కుమారుడు రంగబాబును బరిలోకి దింపాలని రాయపాటి భావిస్తున్నారని గుంటూరు జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...