బీజేపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ?

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపీ... పెద్ద ఎత్తున అనుచరగణం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా కేడర్ ఉన్న రాయపాటిపై బీజేపీ ఫోకస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: July 17, 2019, 12:54 PM IST
బీజేపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ?
రాయపాటి సాంబశివరావు (file)
news18-telugu
Updated: July 17, 2019, 12:54 PM IST
టీడీపీకి చెందిన ముఖ్యనేతలను తమ పార్టీలోకి ఆకర్షిస్తున్న బీజేపీ పెద్దలు... తాజాగా ఆ పార్టీలో ఉన్న సీనియర్ రాజకీయ నేత రాయపాటి సాంబశివరావుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే క్రమంలో...ఆ వర్గానికి చెందిన రాయపాటి సాంబశివరావు వంటి వారిని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాయపాటితో చర్చల కోసం స్వయంగా బీజేపీ ముఖ్యనేత రామ్‌మాధవ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గుంటూరులోని రాయపాటి నివాసానికి రెండు రోజుల క్రితం వచ్చిన రామ్ మాధవ్... తమ పార్టీలో చేరాల్సిందిగా రాయపాటిని ఆహ్వానించినట్లు సమాచారం.

వీరిద్దరి మధ్య సమావేశం రహస్యంగా జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపీ... పెద్ద ఎత్తున అనుచరగణం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా కేడర్ ఉన్న రాయపాటిపై బీజేపీ ఫోకస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాయపాటి ఇంటికి వచ్చిన రామ్‌మాధవ్‌... తమ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే తాను ఢిల్లీ వస్తానని... అక్కడ మరిన్ని విషయాలు మాట్లాడతానని రాయపాటి రామ్ మాధవ్‌కు చెప్పినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు... తనతో బీజేపీ నేత వచ్చి పార్టీలోకి రావాలని కోరిన విషయాన్ని రాయపాటి సాంబశివరావు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని టాక్. ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతో పాటు మరికొన్ని సమస్యలను వివరించి... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాల్సిన ఆవశ్యకత గురించి వివరించినట్లు సమాచారం. మొత్తానికి గుంటూరు టీడీపీలో కీలకమైన నేతగా ఉన్న రాయపాటి సాంబశివరావు కూడా సైకిల్ దిగుతారా అనే చర్చ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...