టీడీపీ నేత కూన రవి అరెస్ట్.. ఆముదాలవలసలో ఉద్రిక్తత

పోలీసుల తీరుకు నిరసనగా కూన రవి, ఆయన అనుచరులు ఆముదాలవలస పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి కూన రవిని అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: March 2, 2020, 2:34 PM IST
టీడీపీ నేత కూన రవి అరెస్ట్.. ఆముదాలవలసలో ఉద్రిక్తత
కూన రవి కుమార్
  • Share this:
టీడీపీ నేత కూన రవికుమార్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సరబుజ్జిలి ఈవోపీఆర్డీ అప్పలనాయుడిని బెదిరించిన కేసులో సోమవారం ఆముదాలవలస పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఐతే పోలీసుల తీరుకు నిరసనగా కూన రవి, ఆయన అనుచరులు ఆముదాలవలస పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి కూన రవిని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు కూన రవిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదటు నిరసనకు దిగారు.
Published by: Shiva Kumar Addula
First published: March 2, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading