ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై (YS Vivekananda Reddy Murder Case) పొలిటికల్ వార్ నడుస్తోంది. వివేకా హత్యపై ఆయన డ్రైవర్ దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య వెనుక వైఎస్ కుటుంబం హస్తముందని ఆయన ఆరోపించారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ను బట్టి చూస్తే ఇందులో ముఖ్యమంత్రి సన్నిహితుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఈక్రమంలో ప్రధానంగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను పట్టాభి ప్రస్తావించారు.
వివేకాను హత్య చేసిన తర్వాత నిందితుడు దస్తగిరి రాజరారెడ్డి ఆస్పత్రిలో రక్తపు మరకలను తుడుచుకున్నట్లు వాంగ్మూలంలో ఉందని పట్టాభి ఆరోపించారు. హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ రెడ్డి... కడప ఎంపీ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ అని.., వివేకా హత్య జరిగిన తర్వాత వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తులే అక్కడి చేరుకొని అక్కడి ఆధారాలను చెరిపివేశారన్నారు. వీరంతా సీఎం వైఎస్ జగన్ కు సంబంధించిన వ్యక్తులేనన్నారు. ముందుగా అక్కడి చేరుకోవాల్సిన అవసరం ఎంపీ అవినాష్ రెడ్డికి, శంకర్ రెడ్డికి ఏంటని ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ ను కలిసి సీబీఐ ఎంక్వైరీని కోరిన వైఎస్ జగన్.. సీఎం అయిన వెంటనే ఎందుకు సిట్ ను క్యాన్సిల్ చేశారో చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. ఆ తర్వాత మరోసారి సిట్ అధిపతిని మార్చారని ఆరోపించారు. ఎవర్ని కాపాడేందుకు సీఎం జగన్ సిట్ ను మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితులను కాపాడేందుకే సిట్ ను మార్చారా..? అని ప్రశ్నించారు. మిమ్మల్నీ మీరే కాపాడుకోవడానికి సిట్ ను మార్చారా అనే ప్రశ్నకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా హత్య కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లోనే హత్య జరిగిందని పట్టాభి ఆరోపించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వెనుక ఉండి శంకర్ రెడ్డిని నడిపించారని.. వీరికి సీఎం జగన్ సపోర్ట్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీబీఐ వైఎస్ అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డి విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే కుట్రపూరితంగా సిట్ ను మార్చడమే కాకుండా దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేసిన సీఎం జగన్ ను కూడా విచారించాలని పట్టాభి డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, TDP, Ys viveka murder case, Ysrcp