TDP LEADER NARA LOKESH TWEETS ON AP CM YS JAGAN MOHAN REDDYS MAIDEN BUDGET BA
ఆ పథకానికి ‘జగనన్న జంపింగ్ జపాంగ్’ పేరు పెట్టాల్సింది: నారా లోకేష్
సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.
Nara Lokesh | ‘ఆర్థికమంత్రిగారు రామాయణమంతా చదివారు, సంజీవని గురించి చెప్పారు. కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకేసినట్టుంది.’ అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మాజీ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. వివిధ పథకాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులతో పాటు, రెండు పథకాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టడం మీద కూడా విమర్శలు గుప్పించారు. ‘రైతుల వడ్డీలేని రుణాల కోసం రూ.3,500 కోట్లు ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లాలో తమ తండ్రిగారి పేరున రైతు దినోత్సవం జరుపుతూ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అసలేమీ ఇవ్వలేదని ఒకరోజు, ఇంతే ఇచ్చిందని ఒకరోజు అన్నారు. తీరా బడ్జెట్ లో నామమాత్రంగా రూ.100 కోట్లు కేటాయించారు.’ అని లోకేష్ విమర్శించారు. దీంతోపాటు ‘జగన్ గారూ! మీ బడ్జెట్ కేటాయింపులే నామమాత్రమా? మీ హామీలు కూడా నామమాత్రమా? చూస్తుంటే మీరు నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారు. రైతుల వడ్డీలేని రుణాలకు రూ.3,500 కోట్లు ఎందుకు కేటాయించలేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి?’ అని మరో ట్వీట్ చేశారు.
జగన్ గారూ! మీ బడ్జెట్ కేటాయింపులే నామమాత్రమా? మీ హామీలు కూడా నామమాత్రమా? చూస్తుంటే మీరు నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారు. రైతుల వడ్డీలేని రుణాలకు రూ.3,500 కోట్లు ఎందుకు కేటాయించలేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి?
‘పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే. అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? పథకానికి కూడా 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే బాగుండేది.’ అంటూ మరో ట్వీట్లో జగన్ మీద సెటైర్లు వేశారు నారా లోకేష్.
.@ysjagan గారూ, పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే. అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? పథకానికి కూడా 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే బాగుండేది.
‘ఆర్థికమంత్రిగారు రామాయణమంతా చదివారు, సంజీవని గురించి చెప్పారు. వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందని ఊదరకొట్టారు. చివరికి ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు విదిల్చారు. కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకేసినట్టుంది.’ అంటూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా సెటైర్లు వేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.