మంగళగిరిలో లోకేశ్ అన్ని కోట్లు ఖర్చు చేశారా... వైసీపీ నేత సంచలన ఆరోపణ

మంగళగిరిలో లోకేశ్ గెలుపు కోసం టీడీపీ నేతలు ఏసీలు, ఫ్రిడ్జ్ లు, టూవీలర్లు, టీవీలు, ఐఫోన్లు పంచారని వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: May 17, 2019, 1:21 PM IST
మంగళగిరిలో లోకేశ్ అన్ని కోట్లు ఖర్చు చేశారా... వైసీపీ నేత సంచలన ఆరోపణ
నారా లోకేశ్(File)
news18-telugu
Updated: May 17, 2019, 1:21 PM IST
మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న వేళ ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌పై ఆయన ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలో గెలుపు కోసం లోకేశ్ ఏకంగా రూ. 150 నుంచి రూ. 200 కోట్లు ఖర్చు చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇది తన మాట కాదని... ప్రజలే ఈ విషయాన్ని చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో టీడీపీ నేతలు ఏసీలు, ఫ్రిడ్జ్ లు, టూవీలర్లు, టీవీలు, ఐఫోన్లు పంచారని ధ్వజమెత్తారు. అయితే ఇవన్నీ మంగళగిరిలో వైసీపీ గెలుపును ఆపలేవని ఆళ్ల అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

మంగళగిరి ఫలితాలపై పలువురు ఎన్నారైలు కూడా తనను వాకబు చేశారన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి... మంగళగిరి అసెంబ్లీ స్థానంతో పాటు గుంటూరు లోక్ సభ సీటు నుంచి కూడా వైసీపీ జెండానే ఎగురుతుందని జోస్యం చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే అంశంతో పాటు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నారా లోకేశ్ మంగళగిరిలో విజయం సాధిస్తారా అనే అంశంపై కూడా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరి... తన ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలకు నారా లోకేశ్ ఏ రకంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...