Home /News /politics /

TDP LEADER NARA LOKESH SLAMS YS JAGAN AND URGES DWACRA GROUPS DO NOT PAY ONE TIME SETTLEMENT CHARGES FULL DETAILS HERE PRN GNT

Nara Lokesh: ఆ డబ్బులు మేమే కడతాం.. డ్వాక్రా మహిళలకు నారా లోకేష్ ఆఫర్..!

నారా లోకేశ్ (పాత ఫొటో)

నారా లోకేశ్ (పాత ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (Jagananna Sampoorna Gruha hakku Scheme) తీవ్రవివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం దగ్గర రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారు నిర్దేశించిన ఛార్జీలు చెల్లిస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐతే ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (Jagananna Sampoorna Gruha hakku Scheme) తీవ్రవివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం దగ్గర రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారు నిర్దేశించిన ఛార్జీలు చెల్లిస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐతే ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా అక్కాచెల్లెళ్ల‌మ్మ‌ల‌కు అండగా ఉంటానన్న సీఎం జగన్ ఇప్పుడు వారికే టోక‌రా వేశార‌ని లోకేష్ ఆరోపించారు. ద‌శాబ్దాల‌క్రితం క‌ట్టుకున్న ఇళ్ల‌కు ఇప్పుడు వ‌న్‌ టైమ్ సెటిల్మెంట్ అంటూ ఒక్కొక్క‌రి నుంచీ బ‌ల‌వంతంగా ప‌దివేలు వ‌సూలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఓటీఎస్ ఎవ్వ‌రూ రూపాయి క‌ట్టొద్ద‌ని, ఓటీఎస్‌ కింద పొదుపుఖాతాల నుంచి జ‌మ వేసుకునే చ‌ర్య‌ల‌ను మ‌హిళ‌లంతా సంఘ‌టిత‌మై అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు. టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఇళ్ల‌ను ఉచితంగా రిజిస్ట్రేష‌న్ చేస్తామ‌ని లోకేష్ హామీ ఇచ్చారు.

  అధికారంలోకి రాక‌ముందు మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యమని ఇప్పుడు మహిళల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారని ఆగ్ర‌హం లోకేష్ వ్య‌క్తంచేశారు. డ్వాక్రా మహిళలకు అభయంగా నిలిచిన అభయహస్తంపై జ‌గ‌న్ కబంధహస్తాల్లో చిక్కి ప‌థ‌కం అమ‌లుపై నీలినీడలు కమ్ముకున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ సొమ్మంతా జ‌గ‌న్ స‌ర్కారు స్వాహా చేసింద‌ని ఆరోపించారు.

  ఇది చదవండి: ఆ 30 మందిపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. వాళ్లు ఎక్కడున్నారంటే..!


  అభ‌య‌హ‌స్తం పథకం ప్రారంభమైన నాటి నుంచి 34 లక్షలకుపైగా పొదుపు మహిళలు క్ర‌మంత‌ప్ప‌కుండా ప్రీమియమ్ చెల్లించార‌న్నారు. ఈ ప‌థ‌కం కింద 60 ఏళ్లు దాటిన‌ 4 లక్షలమందికి పైగా మ‌హిళ‌ల‌కు ఎల్ఐసీ రూ.500 నుంచి రూ.2200 వరకూ నెలవారీ పెన్షన్ వ‌స్తోంద‌ని, ఈ ఆస‌రాలేకుండా చేసిన జ‌గ‌న్‌ మ‌హిళ‌ల్ని మోస‌గించార‌న్నారు.

  ఇది చదవండి: దేశమంతటా అమ్మఒడి.. లోక్ సభలో వైసీపీ ప్రైవేట్ బిల్లు.. టీడీపీకి కొత్తపేరు పెట్టిన విజయసాయి..


  ఓటీఎస్ పేరుతో దోపిడీ
  ఓటిఎస్ పేరుతో మరో దోపిడీకి తెరలేపార‌ని లోకేష్ ఆరోపించారు. 1983 నుంచీ వివిధ ప్రభుత్వాలు పేదలకు నిర్మించి ఇచ్చిన ఇళ్లకు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రూ. 1500 కోట్లు దోపిడీకి ప్లాన్ చేశార‌ని ఆరోపించారు. ఓటీఎస్ కోసం రూ. 10 వేలు చెల్లించకపోతే పెన్షన్ ఆపుతామని, రేష‌న్‌కార్డు తీసేస్తామ‌ని, ప‌థ‌కాల‌కు అన‌ర్హుల‌ను చేస్తామ‌ని నియంతలను తలపించే విధంగా బెదిరించ‌డం మానుకోవాల‌న్నారు. ఓటీఎస్ స్వ‌చ్ఛంద‌మైన‌ప్పుడు ఈ బెదిరింపులు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఒక్క‌రు కూడా ఓటీఎస్ క‌ట్టేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారు కాల్ మనీ మాఫియా అవ‌తార‌మెత్తింద‌న్నారు.

  ఇది చదవండి: డేంజర్ జోన్ లో గుంటూరు మిర్చి.. ఇక ఆ ఘాటు కనిపించదా..?  ఓటిఎస్ డబ్బు చెల్లించకపోతే.. ల‌బ్ధిదారుల కుటుంబ‌స‌భ్యుల‌ డ్వాక్రా పొదుపు సొమ్ము జమ చేసుకుంటామ‌న‌డం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమ‌ని లోకేష్ అన్నారు. పొదుపు సంఘాల లీడర్లను వెంటపెట్టుకుని స్వయంగా అధికారులు బ్యాంకులకు వెళ్లడం పొదుపు సొమ్ము ఖాళీ చేసి ఓటిఎస్ కి చెల్లించడం మహిళల్ని వంచించ‌డ‌మేన్నారు. ప్రభుత్వం పాల్పడుతున్న ఈ అనాలోచిత నిర్ణయాల వలన డ్వాక్రా సంఘాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారనుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పొదుపు ఖాతాలు ఖాళీ చెయ్యడం వలన డ్వాక్రా గ్రూపుల భవిష్యత్తు అంధ‌కారం కానుంద‌ని హెచ్చ‌రించారు. డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసే ఇటువంటి దందా వ్య‌వ‌హారాల‌ను ప్ర‌భుత్వం ఆపాల‌న్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు