TDP LEADER NARA LOKESH SLAMS YCP GOVERNMENT IN TIRUPATI LOKSABHA BY POLL CAMPAIGN NGS
Tirupathi by poll: ఏపీని జేసీబీ ప్రభుత్వం పాలిస్తోంది? జగన్ కాళ్లు నొక్కే మనిషి కావాలా? వైసీపీపై లోకేష్ పంచ్ డైలాగ్ లు
నారా లోకేష్(ఫైల్ ఫోటో)
ఏపీలో జగన్ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రస్తుతం రాష్ట్రాన్ని జేసీబీ ప్రభుత్వం పట్టి పీడుస్తోంది అన్నారు. జేసిబి అంటే జగన్ టాక్స్ , కరప్షన్, బాదుడు అని కొత్త అర్థం చెప్పారు? తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తొలిరోజే పంచ్ డైలాగ్ లు వేశారు లోకేష్.
తిరుపతి ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలేల చేస్తోంది. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి మూడు ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తరపున కీలక మంత్రులు అంతా ఇప్పటికే తిరుపతిలో మకాం వేశారు. ఇటు బీజేపీ కీలక నేతలంతా తిరుపతిలోనే ఉండగా.. మిత్రపక్షం అభ్యర్థి రత్న ప్రభ తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. దీంతో బీజేపీ కూడా అధికార వైసీపీ, ప్రత్యర్థి టీడీపీలతో ఢీ అంటే ఢీ అంటోంది.
ఇటు వైసీపీ, బీజేపీలకు ధీటుగా టీడీపీ కూడా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే కీలక నేతలు అంతా తిరుపతిలో పనబాక లక్ష్మి వెంట ఉండి గెలుపు వ్యూహాలను రచించే పనిలో బిజిగా ఉన్నారు. మరోవైపు స్టార్ క్యాంపైనర్లు అంతా ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. త్వరలోనే నందమూరి బాలయ్య సైతం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి రానున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
వరదయ్య పాలెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా లోకేష్ వైసీపీ నేతల తీరుపై సెటైర్లు వేశారు. వైసీపీకి 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉండి పార్లమెంట్ లో ఏం పీకారు అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని పార్లమెంట్ లో ఆడిగారా? అని నిలదీశారు. ఇదేనా ధర్మపోరాటం అని ప్రశ్నించారు. ఓ పక్క అలీబాబా ఆయన దొంగలు.. మరోవైపు టీడీపీ వీరులు పోరాటం చేస్తున్నారని అన్నారు. టీడీపీ నుంచి ప్రజల కోసం పోరాడే పనబాక కావాలా? లేక సీఎం జగన్ కాళ్ళు నొక్కే మనిషి కావాలా అంటూ ఓటర్లను ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదని.. అది జేసిబి ప్రభుత్వం అన్నారు. జేసిబి అంటే జగన్ టాక్స్ , కరప్షన్, బాదుడు అని కొత్త అర్థం చెప్పారు? అన్ని ధరలు అమాంతం పెరిగాయన్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ కి కనీసం అపాయింట్మెంట్ కూడా సీఎం జగన్ వేధించారని లోకేష్ ఆరోపించారు. దళితుడనే కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. దళిత నేత చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి కూడా సీఎం వెళ్లకపోవడం శోచనీయమన్నారు. వైసీపీ పాలనలో చిత్తూరు లో బాగుపడింది ఒక్క మంత్రి పెద్దిరెడ్డి మాత్రమే అని లోకేష్ విమర్శించారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిని గెలిపించినా.. ఆయన బాగుపడడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు ఉండదు అన్నారు. ప్రజల తరుపున పోరాడే తత్వం ఉన్న పనబాక లక్ష్మి లాంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఓటర్లకు పిలుపు ఇచ్చారు నారా లోకేష్
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.