హోమ్ /వార్తలు /politics /

Nara Lokesh: ఏపీలో ఉన్నది పోలీసులా? రౌడీషీటర్లకు అనుచరులా? ఇంత అరాచకమా అంటూ లోకేష్ ప్రశ్న

Nara Lokesh: ఏపీలో ఉన్నది పోలీసులా? రౌడీషీటర్లకు అనుచరులా? ఇంత అరాచకమా అంటూ లోకేష్ ప్రశ్న

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో అసలు పోలీసులు ఉన్నారా..? పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నవారు వైసీపీ నేతలకు.. రౌడీ షీటర్లకు అనుచరులా..? అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాల్సిన పోలీసులే.. తిరిగి వేధిస్తే.. సామాన్యులకు న్యాయం జరిగేది ఎక్కడ అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పోలీసుల తీరుపై మాజీ మంత్రి.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో ఉన్నది పోలీసులా లేదా వైసీపీ (YCP) రౌడీషీటర్లకు అనుచరులా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కారణమయ్యారని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పులను, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారందరినీ ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటరావు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.

  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి.. టీడీపీ కార్యకర్తలపై వేధింపులు పెరిగాయని చెప్పారు. సోషల్ మీడియా పోస్టుల పేరుతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు ఇప్పటికైనా వేధింపులు ఆపాలని హితవు పలికారు. తాము చట్టాలను గౌరవిస్తున్నామని.. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు తెగబడితే తిరుగుబాటు తప్పదని ఏపీ ప్రభుత్వాన్ని లోకేష్ హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టుల పేరుతో టిడిపి కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలని హెచ్చరించారు. చట్టాలని గౌరవిస్తున్నామని.. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదన్నారు.

  అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం.. కానీ ఇంట్లో ఆడబిడ్డలకే రక్షణ కరువైదని లోకేష్ ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించే మ‌హిళా సంక్షేమం వాస్త‌వంలో వుండ‌దన్నారు. అక్కాచెల్లెమ్మ‌ల మోముల్లో సంతోషం కోసం మ‌ద్య‌నిషేధం హామీఇచ్చిన జ‌గ‌న్‌రెడ్డి త‌న సొంత మ‌ద్యంతో మ‌హిళ‌ల పుస్తెలు తెంపేస్తున్నాడు. చెత్తపన్ను , ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, నిత్యావ‌స‌రాల పెరుగుద‌ల‌తో ఇంటిని న‌డిపే మ‌హిళ‌లు ఘొల్లుమంటున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఆడ‌బిడ్డ క‌న్నీరు ఆ ఇంటికి, రాష్ట్రంలో మ‌హిళ‌ల వేద‌న ఆ రాష్ట్రానికి మంచిది కాదు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నుంచి అయినా మ‌హిళ‌ల భ‌ద్ర‌త, సంక్షేమం కోసం చిత్త‌శుద్ధితో ప‌నిచేసే బుద్ధి జ‌గ‌న్‌రెడ్డికి ఆయ‌న ప్ర‌భుత్వానికి ప్ర‌సాదించాల‌ని దేవ‌త‌ల‌ని ప్రార్థిస్తున్నాను అంటూ వరుస ట్విట్టర్ లో కామెంట్లు చేశారు నారా లోకేష్..

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు