ఏపీకి రాజధాని వద్దా..? సీఎం జగన్‌కు లోకేష్ సూటి ప్రశ్న

అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఎం జగన్ దగ్గర ఉన్న ప్రణాళికలున్నాయా? లేదంటే రాజధానిని ఎక్కడికైనా తరలిస్తున్నారా? చెప్పాలని విమర్శించారు లోకేష్.

news18-telugu
Updated: October 22, 2019, 8:23 PM IST
ఏపీకి రాజధాని వద్దా..? సీఎం జగన్‌కు లోకేష్ సూటి ప్రశ్న
లోకేష్, జగన్
news18-telugu
Updated: October 22, 2019, 8:23 PM IST
మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఏపీ సీఎం జగన్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఏపీ రాజధానికి శంకుస్థాపన చేసి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. అమరావతిపై జగన్ వైఖరేంటో తెలియక.. వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు లోకేష్. రాజధాని ప్రాంతంలో జగన్ కొత్త భవనం కట్టుకున్నారని.. ప్రజలకు మాత్రం రాజధాని అవసరం లేదా..? అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కథల్లో వింటుంటాం. అమరావతి విషయంలో అదే జరిగిందేమో. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోంది.
నారా లోకేష్

అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఎం జగన్ దగ్గర ఏవైనా ప్రణాళికలున్నాయా? లేదంటే రాజధానిని ఎక్కడికైనా తరలిస్తున్నారా? చెప్పాలని విమర్శించారు లోకేష్. రాజధానితో అసలు ప్రభుత్వం వైఖరేంటో జగన్ నోటితోనే చెప్పాలని డిమాండ్ చేశారు.
First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...