హోమ్ /వార్తలు /National రాజకీయం /

భువనేశ్వరి బాధ, చంద్రబాబు ఏడుపు.. నారా లోకేశ్ మౌనం! -సీఎం జగన్‌పై టీడీపీ నేత తాజా విమర్శలు

భువనేశ్వరి బాధ, చంద్రబాబు ఏడుపు.. నారా లోకేశ్ మౌనం! -సీఎం జగన్‌పై టీడీపీ నేత తాజా విమర్శలు

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో )

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో )

నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు కించపర్చారనే ఆరోపణలు, ప్రెస్ మీట్ లో చంద్రబాబు కన్నీటిపర్యంతం తర్వాత మౌనంగా ఉండిపోయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ప్రజాసమస్యలపై మాత్రం గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తిన భారీ వర్షాలపై, బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై నారా లోకేశ్ శనివారం నాడు స్పందించారు..

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (ap assembly) లో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు కించపర్చారనే ఉదంతంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రెస్ మీట్ లో చంద్రబాబు (Chandrababu) వెక్కి వెక్కి ఏడ్చినప్పటి నుంచి ఇండియా లెవల్ లో ఆయన పేరు ట్రెండింగ్ లో నిలిచింది. అసెంబ్లీలో వైసీపీ నేతల మాటలను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు శనివారం నాడు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. సినీ, రాజకీయ దిగ్గజాలు సైతం దీనిపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబం మొత్తం మీడియా ముందుకొచ్చి వైసీపీ తీరును ఖండించాయి. అయితే, భువనేశ్వరి-చంద్రబాబుల సుపుత్రుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం ఈ అంశంపై నోరు మెదకపోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యర్థుల నోళ్లు మూయించేలా లోకేశ్ కనీస స్పందన తెలియజేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతున్నది. భువనేశ్వరి ఉదంతంపై ఇప్పటిదాకా స్పందించని నారా లోకేశ్.. ప్రజాసమస్యలపై మాత్రం గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తిన భారీ వర్షాలపై, బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై నారా లోకేశ్ శనివారం నాడు స్పందించారు..

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప సహా పలు జిల్లాల్లో జలవిలయం దృశ్యాలు నెలకొన్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు నీట మునిగాయి. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. పంట నష్టంపై ఇప్పుడప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. నీటిలో మునిగిపోయిన ఊళ్లలో జనం ఆకలి బాధలు పడుతున్నారు. ఈ పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పందించారు. వర్ష ప్రభావంతో నెల్లూరు, కడప, అనంతపురం, తదితర జిల్లాలు అతలాకుతలం అవుతుంటే ఏపీ సీఎం జగన్‌ కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

భువనేశ్వరి ఉదంతంలో సంచలనం -జగన్ సేనకు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ -వంశీ, నాని పేర్లు చెప్పకుండానే..


వాతావ‌ర‌ణ విభాగం వరుస హెచ్చరికలు జారీ చేసినా, వాటిని జగన్ సర్కారు ఖాతరు చేయకపోవడం వల్లే ఏపీని ఉపద్రవం ముంచెత్తిందని, జగన్ నిర్లక్ష్యం వల్లే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే పేరుతో గాల్లో వెళ్లితే ప్రజల వరద కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశించారు. వర్షాలకు దెబ్బతిన్న రాయ‌ల‌సీమను సీఎం పట్టించుకోవడం లేదని, జనాల కష్టాలు చూడని జగన్‌ సైకోలా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.

Hyderabad : అమ్మమ్మతో అక్రమ సంబంధం.. 11 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం -80ఏళ్ల వృద్దుడి అఘాయిత్యం


వరద బాధితులను ఆదుకోవడంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పొంచి ఉన్న వరద ముప్పును ప‌ట్టించుకోకుండా.. వ్యాపార‌ లావాదేవీలు, పారిశ్రామిక‌వేత్తలతో క‌మీష‌న్ల భేటీలు జ‌రపటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘సీఎం జగన్.. గాల్లోంచి నేల‌కు దిగు..జ‌నం వ‌ర‌ద క‌ష్టాలు క‌నిపిస్తాయి. సీఎం సొంత కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోతే..ఏం జ‌రిగిందో క‌నుక్కునే తీరిక లేని ముఖ్య‌మంత్రిని ఏమ‌నాలి? వ‌ర‌ద‌క‌ష్టాలు తీర్చేందుకు ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని ఎదురుచూడ‌టం వృథా. ముంపుబాధితుల‌కు సాయమందించేందుకు అధికారులు వ‌స్తార‌నేది భ్ర‌మ‌. ఇప్పుడు అధికారం మ‌న‌కు లేక‌పోయినా, సాయం చేసే మ‌న‌సు-స్పందించే మాన‌వ‌త్వం ఉంది. తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర అనుబంధ విభాగాలు వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌లో బాధితుల‌కు మీకు చేత‌నైన సాయం చేయండి’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు. అటు,

నారా భువనేశ్వరిపై దారుణ కామెంట్లు.. స్పీకర్ తమ్మినేని చర్యలు -చంద్రబాబుకు కౌంటర్ -లోకేశ్ పుట్టుకపై..!!


ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాటి పరిణామాల తర్వాత మీడియాతో మాట్లాడుతూ భార్య భువనేశ్వరిని అవమానించారని బోరున విలపించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు.. శనివారానాకి మళ్లీ సెట్ అయ్యారు. వరద పరిస్థితులపై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలిచ్చారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను త్వరలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని కార్యకర్తలకు చెప్పారాయన. టీడీపీ శ్రేణులు బాధితులు ఆదుకోవాలని సూచించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సహాయ, సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. వరద ప్రాంతాల్లోని పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వాలని సూచించారు. ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందుల పంపిణీ జరుగుతుందని , పార్టీ శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయని చంద్రబాబు తెలిపారు. కాగా,

Hyderabad : హీరోయిన్‌పై అత్యాచారం.. లైట్‌బాయ్ బాబు పన్నాగమిదే -shalu chourasiya కేసులో షాకింగ్ ట్విస్ట్


వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. పలు జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌సర్వే నిర్వహించారు. ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. వర్షాల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఇళ్లు కోల్పోయిన, పంటలు కోల్పోయిన, వివిధ రకాలుగా నష్టపోయినవారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Heavy Rains, Nara Bhuvaneshwari, Nara Lokesh

ఉత్తమ కథలు