Home /News /politics /

TDP LEADER NARA LOKESH PLANNING FOR PADAYATRA IN AP AS HE TARGET NEXT ELECTIONS SK

జగన్ బాటలో లోకేష్.. పాదయాత్రకు ప్లాన్.. ఎప్పటి నుంచంటే..

ప్రస్తుతం భీమిలిపై అవంతి పూర్తి పట్టు సాధించారు. ఇలాంటి సమయంలో ఆయనను ఢీ కొట్టడం అంతా ఈజీ కాదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో మాత్రం భీమిలిలో అయితే గెలిచేందుకు అవకాశం ఉందని.. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత సబ్బం హరి.. టీడీపీ కేడర్ పటిష్ట పరిచారని.. ప్రస్తుతం టీడీపీ అన్నీ అక్కడ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం భీమిలిపై అవంతి పూర్తి పట్టు సాధించారు. ఇలాంటి సమయంలో ఆయనను ఢీ కొట్టడం అంతా ఈజీ కాదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో మాత్రం భీమిలిలో అయితే గెలిచేందుకు అవకాశం ఉందని.. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత సబ్బం హరి.. టీడీపీ కేడర్ పటిష్ట పరిచారని.. ప్రస్తుతం టీడీపీ అన్నీ అక్కడ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

పీకే టీమ్‌లో ప‌ని చేసిన కొంత‌మందిని తన టీమ్‌లో చేర్చుకుని వ్యూహాలకు పదునుపెడుతున్నారు నారా లోకేష్.

  (బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు కరెస్పాండెంట్)
  పాద‌యాత్ర..  ఏపీ రాజకీయాల్లో దీనికి ప్రత్యేక స్థానముంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో ప్రారంభమైన ఈ ట్రెండ్.. ప్రస్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి వ‌ర‌కు కొన‌సాగింది. ఏపీలో అధికారానికి ద‌గ్గ‌ర చేసే అస్త్రంగా ఈ పాద‌యాత్ర‌ను భావిస్తారు అంద‌రు రాజ‌కీయ నాయకులు. దాదాపు 3 వేలు పైచిలుకు కిలోమీట‌ర్లు న‌డిచిన త‌రువాతే జ‌గ‌న్ మోహన్ రెడ్డికి అఖండ మెజార్టీ క‌ట్ట‌బెట్టారు ఏపీ ప్ర‌జ‌లు. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను టీడీపీ కూడా ఫాలో అవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇదే ఫార్ములాతో త‌న‌కంటూ ఒక స్ప‌ష్ట‌మైన ఇమేజ్ ను సృష్టించుకోవ‌డానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం మూహుర్తం కూడా ఖరారు చేసినట్లు ఆ పార్టీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మ‌ాచారం.

  పాద‌యాత్ర‌ను దృష్టిలో పెట్టుకొనే లోకేష్ త‌న‌ బరువును కూడా త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి నుంచే పాద‌యాత్ర‌కు త‌న శరీరాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు నారా లోకేష్. దాదాపు నాలుగువేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌కు ఆయన రెడీ అవుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న త‌రువాత త‌న పాద‌యాత్ర నారా లోకేష్ ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఐతే పాదయాత్రలో ఇప్ప‌టికే జ‌గ‌న్ పేరిట ఓ రికార్డు ఉంది. జ‌గ‌న్ మోహన్ రెడ్డి 3,648 కిలోమీట‌ర్లతో 155 నియోజవర్గాల్లో పర్యటించారు. అయితే ఇప్పుడా రికార్డును చేరిపేలా వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల్లోనే ఉండేలా లోకేష్ పాద‌యాత్ర‌ను ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 4 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు స‌మాచారం.

  ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం గ‌తంలో ఎప్పుడు లేని విధంగా టీడీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. అందులో కొంత మంది ప‌క్క చూపులు చూడ‌డంతో ఇప్పుడు పార్టీలో చంద్ర‌బాబు త‌రువాత అంత‌టి నేత‌లు లేక‌పోవ‌డం పార్టీకి పెద్ద మైన‌స్‌లా మారింది. గ‌ట్టిగా మాట్లాడే అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ లాంటి వాళ్ల‌ను ఇప్ప‌టికే ప‌లు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ వాణి వినిపించే నాయకులు లేకుండా పోయారు. మ‌న‌కెందుకొచ్చిందిలే అనుకొని కొంత‌మంది తెలుగుదేశం నేత‌లు వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ముందుకురావ‌డం లేదు. ఇది పార్టీ భవిష్య‌త్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.

  ఇప్ప‌టికే నారా లోకేష్‌ను డ‌మ్మినేత‌గా ప్రత్యర్థి పార్టీల నేతలు డమ్మీ నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ముద్ర‌ను చెరుపుకోవ‌డానికి త‌న‌కంటు ఒక ప్ర‌త్యేక‌మైన సొంత ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి లోకేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే పీకే టీమ్‌లో ప‌ని చేసిన కొంత‌మందిని తన టీమ్‌లో చేర్చుకుని వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన‌ మంగళగిరి నుంచి ఓటమి చ‌విచూడ‌డం ఆయ‌న‌కు పొలిటిక‌ల్‌గా ఓ మైనస్ పాయింట్‌గా మారింది. దీంతో నేరుగా ప్రజల్లోకి వెళ్లి మాస్ లీడర్‌గా నిరూపించుకునేందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని… ప్రస్తుతం ప్రణాళికల అన్నీ ఈ దిశగానే సాగుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి పాదయాత్ర ఫార్మాలా లోకేష్‌కు కూడా క‌లిసొస్తుందా లేదా అనేది చూడాలి అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Tdp

  తదుపరి వార్తలు