TDP LEADER NARA LOKESH ONCE AGAIN CHALLENGE TO CM JAGAN ON YS VIVEKA MURDER CASE NGS
tirupati by poll: కత్తితో వచ్చినోడు కత్తితోనే పోతాడు. జగన్ కు దమ్ముంటే అలిపిరికి రావాలంటూ లోకేష్ సవాల్
సీఎం జగన్ కు నారా లోకేష్ సవాల్
వైఎస్ వివేకానంద హత్య కేసు చుట్టూ తిరుగుతోంది తిరుపతి ఉప ఎన్నిక. టీడీపీ తమ ప్రచారంలో వివేక హత్య కేసునే ప్రధాన ఆయుధంగా చేసుకుంటోంది. ఈ హత్య కేసుతో తమ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయగలరా అంటూ జగన్ కు సవాల్ విసిరిన లోకేష్. మరోసారి ఇప్పుడు అలిపిరి గేటు దగ్గర బైఠాయించి.. మరోసారి సవాల్ విసిరారు.
తిరుపతి ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు దాటి సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్తితి హీటెక్కింది. ముఖ్యంగా చంద్రబాబు రోడ్ షోలో రాళ్లు కలకలం రేపాయి. ఆ రాళ్లు వేసింది వైసీపీ నేతలే అని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై గర్నవర్ కు, ఎన్నికల సంఘానికి సైతం టీడీపీ ఫిర్యాదు చేసింది. అటు వైసీపీ నేతలు ఇదంతా చంద్రబాబు రాజకీయ డ్రామా అంటున్నారు. అసలు రాళ్ల దాడి జరిగినట్టు ఆధారాలే లేవు అంటున్నారు పోలీసులు. ఇదే సమయంలో లోకేష్ తీరును తప్పు పడుతూ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల వీడియో కలకలం రేపుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
సవాళ్ల పర్వం మాత్రం ఆగడం లేదు. తాజాగా లోకేష్ మరోసారి తన సవాల్ ను గుర్తు చేశారు. మాజీ మంత్రి వివేకా హత్యకేసుతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సిద్ధమయ్యారు. అలిపిరికి చేరుకున్న ఆయన అక్కడ చెక్‌పోస్ట్ దగ్గరకు చేరుకొని బైఠాయించారు. అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర ప్రమాణం చేస్తున్నా? దమ్ముంటే జగన్ రావాలి అంటూ సవాల్ విసిరారు.
సీఎం జగన్ వస్తాను అంటే తాను అలిపిరిలోనే ఉంటాను అన్నారు. ఆ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం జగన్ ఎందుకు రాలేకపోతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జగన్‌ను అలిపిరి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి వివేకా హత్య కేసుకు సంబంధం లేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఆ హత్య జరిగి 24 నెలలు గడిచినా సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. కనీసం బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్‌కు లేదా అని నిలదీశారు.
ఏపీ ప్రజలంతారికీ రక్త చరిత్ర ఎవరిదో తెలుసన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని.. వివేకా హత్య కేసుకు తమ కుటుంబానికి సంబంధం లేదన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు అవినాష్‌రెడ్డి, గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డే అన్నారు. వివేకా కుమార్తె కోర్టుకెళ్లినా జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోతున్నారన్నారు. కత్తితో వచ్చిన వాళ్లు కత్తితోనే పోతారంటూ లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ హత్యతో టీడీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపించి అధికారంలోకి వచ్చారని.. మరి ఇప్పుడు శ్రీవారి పాదాల సాక్షిగా ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దాం రండి అని సీఎం జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.