హోమ్ /వార్తలు /National రాజకీయం /

Nara Lokesh: నారా లోకేశ్ కొత్త లుక్ వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా ?.. ఆ నేతను ఫాలో అవుతున్నారా ?

Nara Lokesh: నారా లోకేశ్ కొత్త లుక్ వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా ?.. ఆ నేతను ఫాలో అవుతున్నారా ?

నారా లోకేశ్ న్యూ లుక్

నారా లోకేశ్ న్యూ లుక్

Nara Lokesh: నారా లోకేశ్‌ కొత్త లుక్‌ చూసిన టీడీపీ శ్రేణులు.. తమ యువనేత లుక్ మారిందని.. ఇదే క్రమంలో ఆయన వర్కింగ్ స్టయిల్ కూడా మారుతుందేమో అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

సినిమా హీరోలు మాత్రమే కాదు.. అప్పుప్పుడు రాజకీయ నాయకులు కూడా తమ లుక్ మార్చుతుంటారు. ఫేస్ లుక్‌తో పాటు బాడీ లుక్‌ను కూడా మార్చేస్తుంటారు. తాజా ఏపీ టీడీపీ (TDP) యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా కొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా, గడ్డం లేకుండా కనిపించిన నారా లోకేశ్.. ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. కొంతకాలం నుంచి నారా లోకేశ్ స్లిమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మరింత సన్నబడ్డారు. అంతేకాదు ఒకప్పుడు నీట్ షేవ్‌తో కనిపించిన నారా లోకేశ్.. ఇప్పుడు మాత్రం కాస్త గడ్డం పెంచుకుని రఫ్ లుక్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నారు. ఇదే లుక్‌తో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

అయితే నారా లోకేశ్ ఈ లుక్‌లోకి మారడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు సాఫ్ట్‌గా కనిపిస్తే పెద్దగా వర్కువట్ కాదనే నిర్ణయానికి వచ్చిన లోకేశ్.. ఈ రకంగా తన లుక్‌ను మార్చినట్టు తెలుస్తోంది. ఈ కొత్త లుక్‌లో మారడానికి ఆయనకు కొన్ని నెలల సమయం పట్టినట్టు సమచారం. నారా లోకేశ్‌ కొత్త లుక్‌ చూసిన టీడీపీ శ్రేణులు.. తమ యువనేత లుక్ మారిందని.. ఇదే క్రమంలో ఆయన వర్కింగ్ స్టయిల్ కూడా మారుతుందేమో అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?

Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. చంద్రబాబు (Chandrababu )తరువాత టీడీపీ వ్యవహారాలను చూసుకోవాల్సి బాధ్యత లోకేశ్ మీదే ఎక్కువగా ఉంటుంది. ఆ దిశగా పని చేసేందుకు లోకేశ్ సిద్ధమవుతున్నారని.. ఈ క్రమంలోనే లుక్ కూడా మార్చారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో క్లీవ్ షేవ్‌తో కనిపించిన ఏపీ సీఎం జగన్ కూడా ఇప్పుడు కాస్త గడ్డంతో కనిపిస్తున్నారని.. బహుశా లోకేశ్ కూడా ఈ విషయంలో వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి లుక్ విషయంలో కొత్తదనాన్ని ట్రై చేసిన నారా లోకేశ్.. పనితీరు విషయంలోనూ ఏమైనా కొత్తదనం చూపిస్తారేమో చూడాలి.

First published:

Tags: Nara Lokesh, TDP

ఉత్తమ కథలు