హోమ్ /వార్తలు /politics /

Nara Lokesh: లోకేష్ కు ఇదే మంచి ఛాన్స్..? ప్రజల్లోకి వెళ్లి క్యాష్ చేసుకుంటారా..?

Nara Lokesh: లోకేష్ కు ఇదే మంచి ఛాన్స్..? ప్రజల్లోకి వెళ్లి క్యాష్ చేసుకుంటారా..?

నారా లోకేశ్ (ఫైల్ పోటో)

నారా లోకేశ్ (ఫైల్ పోటో)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) రెండు రోజులుగా అధికాల వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య జరుతున్నవార్ ఎవరికి మైలేజ్ ఇస్తుందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Anna Raghu, Guntur, News18

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) రెండు రోజులుగా అధికాల వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేతల మధ్య జరుతున్నవార్ ఎవరికి మైలేజ్ ఇస్తుందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో వైసీపీకంటే.. టీడీపీకే ప్లస్ అవుతుందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కు ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త ఆయుధం దొరికిందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన లోకేష్.. పార్టీ నాయకులతో ఉన్న విబేధాలకు పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరినట్లు సమాచారం. ఒకప్పుడు పార్టీ సీనియర్లతోనూ.. ఇతర నేతలతో అంతర్గత సమావేశాలకే పరిమితం అయ్యేవారు.. కేవలం పార్టీ వ్యవహారాలు తప్ప ఇతర అంశాలు పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు రూటు మార్చారు.. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకో ప్రజా సమస్యపై పోరాటం చేస్తున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.

ఇటీవల ప్రజా సమస్యలపై పోరాటంలో ఒక విధంగా సక్సెస్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా పది, ఇంటర్ పరీక్షలపై లోకేష్ పోరాటం ప్రజల్లో ముద్ర వేసేలా చేసింది. లోకేష్ తీరుకు వ్యతిరేకంగానే ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేసిందంటూ వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరిగింది. ప్రభుత్వం మొండి పట్టు పట్టినా లోకేష్ వెనక్కు తగ్గలేదు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎట్టకేలకు ఆ విషయంలో లోకేష్ వంద శాతం విజయం సాధించారు.

ఇది చదవండి: టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ట్విస్ట్.. లోకేష్ పై హత్యాయత్నం కేసు..


ఇక పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులతో పాటు సామాన్యులకు నష్టం జరిగినా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకుంటున్నారు. ఆ కుంటుంబానికి అండగా నిలుస్తామనే భరోసా కల్పిస్తున్నారు.. గుంటూరు జిల్లాలో దళిత బీటెక్ విద్యార్థి హత్య ఘటనలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. దిశ చట్టం అంటూ చప్పట్లు కొట్టించుకోవడం తప్ప సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకోవడం లేదని లోకేష్ మండిపడ్డారు. అందుకే పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా టీడీపీ నేతలు.. ఆందోళనకు దిగారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేత నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటికల్ కెరీర్‌లో తొలిసారిగా లోకేష్ అరెస్టయ్యారు.

ఇది చదవండి: టీడీపీని నిషేధించాలి... ఈసీని కోరతామన్న బొత్స... ఏపీలో హైవోల్టేజ్ పొలిటికల్ వార్..


ఐతే నిన్న జరిగిన ఘటనను లోకేష్ కు అందివచ్చిన అవకాశం గా చెప్పుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకేష్ ఈ ఘటన పై ప్రతిపక్షం పిలుపు ఇచ్చిన బంద్ కార్యక్రమం జరగకుండా ఉండేదుకు అధికార పక్షం పోలీస్ లతో రాత్రి నుండే ముఖ్యనాయకులు మరియు దెలుగుదేశం అభిమానులు సానుభూతి పరులను గృహ నిర్బంధం చేయటంతో ప్రతిపక్షానికి ప్రభుత్వం భయపడిందనే చర్చను టీడీపీ లేవనెత్తుతోంది. ఇదే అదునుగా భావించి ప్రజల్లోకి వెళ్తే పార్టీకి పూర్వవైభవం తీసుకురావొచ్చని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరి లోకేష్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా..? లేదా..? అనేది వేచి చూడాలి.

First published:

Tags: Nara Lokesh, TDP

ఉత్తమ కథలు