అదేమన్నా పులివెందుల అనుకున్నావా.. సీఎం జగన్‌పై లోకేష్ ఫైర్..

మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై నిన్న అసెంబ్లీలో వైసీపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ రోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించి అధికార వైసీపీ, సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు.

news18-telugu
Updated: December 11, 2019, 8:50 AM IST
అదేమన్నా పులివెందుల అనుకున్నావా.. సీఎం జగన్‌పై లోకేష్ ఫైర్..
నారా లోకేష్ (ఫైల్)
  • Share this:
మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై నిన్న అసెంబ్లీలో వైసీపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ రోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించి అధికార వైసీపీ, సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. తెలుగులో తాను మాట్లాడిన మాట వల్ల పోలవరం ఆగిపోయిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎనిమిదేళ్లు విదేశాల్లో ఉన్నానని.. అందువల్ల తెలుగులో ఆటు ఇటు మాట్లాడటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటని ప్రశ్నించారు. 11 కేసుల్లో, రూ.43వేలకోట్ల దోచేశారని సీబీఐ, ఈడీ కూడా చెప్పిందని, 16 నెలలు జైల్లో ఉన్న జగన్ తన గురించి మాట్లాడమా? అని అన్నారు. తాను కూడా మాట్లాడాలంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానని, పద్ధతి ప్రకాారం మాట్లాడాలని హితవు పలికారు.

చంద్రబాబు నాయుడు తన కుమారుడిని గెలిపించుకోలేకపోయారని అన్నారని, కానీ.. తాను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే వ్యక్తిని కాదని వైసీపీకి చురక అంటించారు. తన తండ్రి గెలిచిన చోటే తాను పోటీ చేసి గెలిచి కాలర్ ఎగరేయొచ్చని, కానీ.. తాను టీడీపీ గెలవని చోట తాను పోటీ చేశానని చెప్పుకొచ్చారు. 1985 తర్వాత టీడీపీ ఎప్పుడూ మంగళగిరిలో గెలవలేదని, ఆ చరిత్రను తిరిగి రాయాలని పోటీ చేశానని అన్నారు.

తాను పోటీ చేసిన అసెంబ్లీ పులివెందుల కాదని సీఎం జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్‌కు పొద్దున లేచినప్పటి నుంచే కంగారు అని, పక్కనున్న పోలీసులు ఎప్పుడు తనను జైలుకు తీసుకెళ్తారోనని బెంగ అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్‌పై వైసీపీ చేసిన ఆరోపణలపైనా లోకేష్ వివరణ ఇచ్చారు.First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>