Home /News /politics /

TDP LEADER NARA LOKESH COUNTER TO YCP LEADER COMMENTS ON KUPPAM MUNICIPAL RESULT NGS

Nara Lokesh: శునాకానందం వద్దు.. త్వరలోనే లెక్కలు తెలుస్తాయి.. చెంప దెబ్బల వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

కుప్పంలో నారా లోకేష్

కుప్పంలో నారా లోకేష్

Nara Lokesh on Jagan: ఏపీలో మున్సిపల్ ఎన్నిలక ఫలితం కూడా వచ్చేసింది. గెలుపు ఓటముల లెక్కలు అన్నీ తేలిపోయాయి.. అనా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కుప్పం ప్రజలు.. నారా లోకేష్ ప్రజల రెండు చెప్పలపై కొట్టారని వైసీపీ నేతలు విమర్శిస్తే.. దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్..

ఇంకా చదవండి ...
  Nara Lokesh on ap municipal election Result: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara chanrdababu naidu) సొంత నియోజకవర్గం.. నారా వారి కంచుకోటగా చెప్పుకునే కుప్పం మున్సిపాలిటీలొనూ వైసీపీ ప్రభంజనం కొనసాగింది. అక్కడ 25 వార్డులకు గాను.. 19 వార్డుల్లో వైసీపీ గెలిస్తే.. కేవలం 6 వార్డుల్లోనే టీడీపీ సత్తా చాటింది. అంటే వార్ వన్ సైడ్ అయ్యింది. కుప్పం మున్సిపాలిటీ వైసీపీ వశమైంది. దీంతో వైసీపీ నేతలు (YCP Leaders) సంబరాలు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నారా లోకేష్ (Nara lOkesh) కు ఓటు ఉన్న నియోజకవర్గంలోనే ఓడిపోయారని.. ఇప్పుడు తండ్రి నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే.. కుప్పం ప్రజలు రెండు చెంపలు పగలగొట్టి.. మీ సేవలు మాకొద్దు అంటూ తరిమి కొట్టారంటూ వైసీపీ నేతలు విమర్శించారు.

  వైసిపి పట్ల ప్రజల ఆదరణ అని, జగన్ సర్కార్ ను ప్రజలు ఆదరిస్తారని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, టిడిపిని మూసి వేయాల్సిందే అని, నారా లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీ మరింత దెబ్బతింటుందని, లోకేష్ ప్రచారం చేసిన కుప్పంలోనూ ఓటమి పాలు కావడం అందుకు నిదర్శనమే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.

  ఇదీ చదవండి: కాలు కదపలేదు.. ప్రచారం చేయలేదు.. ఓటు వేయమని అడగలేదు.. వార్ వన్ సైడ్.. ఎలా సాధ్యమైంది..?

  అధికార పార్టీ విమర్శలపై లేటుగా అయినా ఘాటుగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దొంగ ఓట్లు, వంద‌ల కోట్లు, గూండా గిరీ, అధి కారులు –పోలీసుల అండ‌ తో కుప్పంలో గెలిచామ‌ని వైసీపీ పార్టీ భావిస్తోందని నారా లోకే ఎద్దేవా చేశారు. ప్రజ‌లు తన రెండు చెంపలు పగలగొట్టారని శున‌కానందంలో వైసీపీ పార్టీ నేతలు ఉన్నారని చురకలు అంటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్‌ కి వ్యతిరేకంగా ఓటేసి, వైసీపీ బట్టలూడదీసి వాయ‌గొట్టార‌నేది బులుగు బుర్రలకి ఎప్పుడు ఎక్కుతుందో..? అంటూ వైసీపీ నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. దౌర్జన్యంగా తెలుగు దేశం పార్టీ విజయం సాధించిందని మండిపడ్డారు నారా లోకేష్‌.

  దొంగ ఓట్లు,వంద‌ల కోట్లు,గూండాగిరీ, అధికారులు-పోలీసుల అండ‌తో కుప్పంలో గెలిచామ‌ని,ప్ర‌జ‌లు లోకేష్ రెండు చెంపలు పగలగొట్టారని శున‌కానందంలో ఉన్నారు వైసీపీ నేతలు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్‌కి వ్యతిరేకంగా ఓటేసి,@ysjagan బట్టలూడదీసి వాయ‌గొట్టార‌నేది బులుగుబుర్రలకి ఎప్పుడెక్కుతుందో?

  తెలుగుదేశం పార్టీ మాత్రం కుప్పం ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అంగీకరించడం లేదు. పుంగనూరు ఇతర ప్రాంతాల నుండి దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారని, పోలీసులు ఎన్నికల సంఘం అధికారులు వైసీపీకి వత్తాసు పలికారని , తెలు సృష్టించారని, ఇక ఇది గెలుపే కాదని టిడిపి నేతలు తేల్చి చెబుతున్నారు.

  ఇదీ చదవండి: గ్రామాలే కాదు.. నగరాలు వైసీపీ వెంటే.. విజయానికి అదే కారణమంటూ సీఎం జగన్ ట్వీట్

   కుప్పంలో వైసీపీది గెలుపేనా అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ నేతలకు దమ్ము ఉంటే.. రెఫరెండమ్ అని చెప్పి.. అందరూ రాజీ నామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.. ఇలా అధికార విపక్షాల మధ్య కౌంటర్లు ఎన్ కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kuppam, Nara Lokesh, Tdp, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు